అందమైన హీరోయిన్ కావాలని, తమకు జోడీగా పెట్టుకోవాలను ఎవరికి ఉండదు. ఇక అందం, అభినయం రెండూ కలిస్తే ఆ భామ పంట పండినట్లే. తెలుగులో అసలే ఒక్కో మూవీకి ఇద్దరేసి, ముగ్గురేసి అమ్మాయిలను తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రతీ సినిమాకు కధానాయిక మారాల్సిందే.


ఇటువంటి టైమ్ లో ఎంతమంది సుందరాంగులు వచ్చినా టాలీవుడ్లో కొరత అలాగే ఉంది. ఇపుడు పరిస్థితి చూస్తే కొత్తందం కావాలని కుర్ర హీరోలు తెగ డిస్కవరీ చేస్తున్నారు. నానితో విక్రం కుమార్ తీస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ లో కొత్త అమ్మాయి ప్రియాంక మోహన్ని సెలెక్ట్ చేశారు. ఈ అమ్మాయి అంతగత్తె. నటనలో కూడా మంచి మార్కులు కొట్టేసింది. ఇంకేంటి. కుర్ర హీరోలంతా ఆమె  కోసం క్యూ కట్టేశారు.


మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ప్రియాంక కోసం టాలీవుడ్లో రేసింగ్ మొదలైపోయింది. అయితే ఈ విషయం తెలిసిన విక్రం కుమార్ మాత్రం తమ సినిమా రిలీజ్ తరువాతనే ప్రియాంక కొత్త సినిమాకు సంతకం చేయాలని షరతు పెట్టారట. ఇప్పటివరకూ ప్రియాంక పిక్స్ ని కూడా పెద్దగా బయటకు రిలీజ్ చేయడంలేదుట. మరి అంత డిమాండ్ ఉన్న ఈ ముద్దు గుమ్మ టలీవుడ్ ని కొంతకాలం ఏలెస్తుందా... ఏమో  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: