ఈ సమ్మర్ రేస్ కు విడుదలైన ‘మహర్షి’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా ఈమూవీ కలక్షన్స్ ఓవర్సీస్ లో అత్యంత నిరాశ పరిచినా ఊహించని విధంగా ‘మహర్షి’ మొన్నటితో ముగిసిన 5వ వారం వీకెండ్ తో ప్రపంచ వ్యాప్తంగా 101 కోట్ల నెట్ షేర్ ను వసూలు చేయడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. దీనితో చిరంజీవి లైఫ్ టైం బెస్ట్ రికార్డ్ ‘ఖైదీ నెంబర్ 150’ ద్వారా వచ్చిన 102 కోట్ల నెట్ కలెక్షన్స్ కు కేవలం కొన్ని లక్షల రూపాయల తేడాతో మాత్రమే ఉండటంతో ఈ వారంతంతో ‘మహర్షి’ చిరంజీవి లైఫ్ టైం రికార్డును బ్రేక్ చేయడం ఖాయం అని అంటున్నారు.

ఇప్పటికే ఈమూవీ నైజాం ప్రాంతంలో రంగస్థలం నెట్ కలక్షన్స్ రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా ప్రస్తుతం ఇంకా ప్రదర్శింప బడుతున్న ధియేటర్స్ లిస్టులో ‘రంగస్థలం’ ధియేటర్స్ లిస్టుకు మించి ఉంది. దీనితో మహేష్ ఒకవైపు చిరంజీవికి మరొక వైపు చరణ్ కు చెక్ పెడుతూ ఫిలిం ఇండస్ట్రీలో తన నెంబర్ వన్ స్థానాన్ని అనుకోకుండా కొనసాగించడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. 

వాస్తవానికి ‘మహర్షి’ తరువాత ఎన్నో ఇనిమాలు విడుదలైనా ఏసినిమాకు టోటల్ పాజిటివ్ టాక్ రాకపోవడంతో పాటు ఈ సమ్మర్ రేస్ లో టాప్ హీరోల సినిమాలు ఏమీ లేకపోవడం మహేష్ కు అనుకోని అదృష్టం. ఈమూవీ మొదటిరోజు టాక్ విన్నవారికి ఈ స్థాయి కలక్షన్స్ కూడ వస్తాయని ఎవరూ ఊహించలేదు. 

దీనితో డివైడ్ టాక్ తెచ్చుకుని కూడ ‘మహర్షి’ మహేష్ కు ఊహించని రికార్డులు ఇవ్వడమే కాకుండా ఏకంగా చిరంజీవి రికార్డ్ కు చెక్ పెట్టె దిశగా అడుగులు వేయడం అత్యంత ఆశ్చర్యకరం. దీనితో చిరంజీవి తాను పోగొట్టుకోబోతున్న రికార్డులను తిరిగి పొందాలి అంటే ‘సైరా’ రావాలి. ఇప్పుడు ఈవార్తలను హైలెట్ చేస్తూ ప్రముఖ ఛానల్స్ కూడ కథనాలు ప్రసారం చేస్తున్న నేపధ్యంలో ఈవిషయాలు అన్నీ ఒక విధంగా మెగా స్టార్ కు ఊహించని షాక్..
 


మరింత సమాచారం తెలుసుకోండి: