మెగాస్టార్ చిరంజీవి - స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో   వస్తోన్న సినిమా,  ఆగస్ట్ 22న  చిరు పుట్టినరోజు  సందర్భంగా  ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం సెప్టెంబర్ రెండో వారం నుంచి మొదలు కానుంది. నాలుగు నెలలు క్రితమే మొదవ్వాల్సిన ఈ సినిమా,  'సైరా నర్సింహారెడ్డి' చిత్రం షూటింగ్ ఆలస్యం కావడంతో  పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.  


ఇక  చిరు కోసం  కొరటాల  ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న  స్క్రిప్ట్ ను  తయారు చేశారట. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులు అద్ది సినిమా తియ్యడంలో దిట్టైన శివ, చిరు కోసం  డ్యుయెల్ రోల్స్ రాశారు.  రైతన్నగా ఓ పాత్ర, యన్.ఆర్.ఐ గా మరో పాత్ర ఉంటుందట. మొత్తానికి సోషల్ డ్రామాతో తెరకెక్కనున్న ఈ సినిమాలో స్ట్రాంగ్ మెసేజ్ ఉండబోతుందన్నమాట. 


ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది  ఏప్రిల్ రెండవ వారంలో ఉగాది పండుగ సందర్భంగా  ఈ సినిమాని విడుదల చేయాలని ఇప్పటికే మేకర్స్ ప్లాన్ చేశారు.  ఇక  ఈ చిత్రంలో సునీల్, అనసూయ  కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తునట్లు ఇప్పటికే  సోషల్ మీడియాలో అనేక రూమర్స్ కూడా వచ్చాయి. మరి వాటిల్లో ఎంత నిజం ఉందో  సినిమా స్టార్ట్ అయితే గాని తెలియదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: