ఇటీవల ఏపి, తెలంగాణలో ఎన్నిక హడావుడిలో తలమునకలైన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మళ్లీ మూవీస్ పై ఫోకస్ చేస్తున్నారు.  ఏపిలో జరిగిన ఎన్నికల్లో హిందూపుర్ నుంచి ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.  అంతకు ముందు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నటించినా..అది ఆశించినంత ఫలితం ఇవ్వలేక పోయింది..ఇంతలోనే ఏపిలో ఎన్నికలు రావడం, ప్రచారంలో బిజీ అయిపోవడం జరిగింది.


ఆ మద్య బాలకృష్ణ బోయపాటి, వివివినాయక్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అంతే కాదు  కె.ఎస్ రవి కుమార్ తోనే ముందుకు వెళ్తాడని మరికాస్సేపు డిస్కషన్ నడిచాయి. అసలు వీరిద్దరు కాకుండా కొత్త డైరక్టర్ ని ఎంకరేజ్ చేయబోతున్నాడని మరికొందరు కథనాలు రాసేసారు. కాగా, నిన్న ఆయన పుట్టిన రోజు వేడుక సందర్భంగా వీటన్నింటికి పులిస్టాప్ పెట్టారు.  


తన తదుపరి సినిమా సి.కళ్యాన్ తో ఉందని..అందుకు నిన్ననే ముహూర్తం కూడా కుదిరిందని చెప్పకనే చెప్పారు. అంతే కాదు ఈ సినిమా లాంచింగ్  మరో రెండు రోజుల్లో అంటే 13న జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ  సినిమాలో  బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నారు. జగపతిబాబు విలన్ గా, హీరొయిన్స్ గా మేహ్రీన్ పాయల్ రాజ్ పుత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సంక్రాంతి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: