ఒక్క ఛాన్స్..ఒకే ఒక్క ఛాన్స్ నేనేంటో చూపిస్తా.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్  ఈ డైలాగ్  చదువుతుంటే..‘ఖడ్గం’సినిమా గుర్తుకు వస్తుంది కదా...కానీ ఈ డైలాగ్ వందల వేల మంది ప్రతిరోజూ స్టూడియోల చుట్టూ..కృష్ణానగర్ లో వినిపిస్తూనే ఉంటాయి.  తమ టాలెంట్ చూపిస్తాం ఇక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఎంతో మంది యువతీ యువకులు స్టూడియోట చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 

ఇదే కాన్సెప్ట్ ఖడ్గం లో కూడా ఉంది..ఒక్క ఛాన్స్ ఇస్తే దుమ్ముదులిపేస్తానని మాస్ మహరాజ రవితేజ ప్రతి ఒక్కరినీ వేడుకుంటు ఉంటాడు.  ఇదే సమయంలో పల్లెటూరు నుంచి వచ్చిన ఓ అమ్మాయి 'ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్’ అనడం..తర్వాత ఓ దళారీతో కమిట్ మెంట్ ఇవ్వడం..హీరోయిన్ కావడం జరిగిపోతుంది. 

తాజాగా ఈ పాత్ర లో నటించిన సంగీత ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఆ డైలాగ్ అంతగా జనంలోకి వెళ్లడానికి కారణం .. నా మనసు లోతుల్లో నుంచి ఆ డైలాగ్ రావడమే .. అంత సహజంగా ఆ డైలాగ్ నేను చెప్పడానికి కారణం, అప్పుడు నా కెరియర్ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండటమే.

దర్శకులు కృష్ణవంశీ ఈ పాత్రను గురించి చెబుతున్నప్పుడు .. ఈ సినిమాను తెరపై చూస్తున్నప్పుడు ప్రస్తుతం నా పరిస్థితి ఇదే కదా అని అనుకునేదాన్ని  అని చెప్పుకొచ్చారు. అందుకే ఆ పాత్రకు, ఆ డైలాగ్ కి ఎంతో ప్రాచుర్యం వచ్చిందని అన్నారు సంగీత. 


మరింత సమాచారం తెలుసుకోండి: