యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా త్వరలో కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను రేపు అధికారిక పూజ కార్యక్రమాలతో ప్రారంభించనుందట చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తుండగా ఇందులో బాలయ్య ఒక పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించనున్నట్లు సమాచారం. గతంలో అయన జయంత్ దర్శకత్వంలో నటించిన లక్ష్మినరసింహ చిత్రంలో చేసిన స్వామి పాత్ర వలె ఈ సినిమాలో కూడా ఆయనది కొంత నెగటివ్ ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ అంటున్నారు. 

ఇకపోతే ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు గతంలో పలు కథనాలు ప్రచారమైన విషయం తెలిసిందే. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు క్రాంతి అనే టైటిల్ ని పెట్టాలని యోచిస్తోందట చిత్ర యూనిట్. నిజానికి ఈ సినిమాలో బాలయ్య పాత్ర పేరు క్రాంతి అని, కాబట్టి అదే పేరును సినిమా టైటిల్ గా పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్ ని కూడా సెలెక్ట్ చేయడం జరిగిందట. అయితే హీరోయిన్, ఇతర నటీనటులు, మరియు సాంకేతిక నిపుణుల వివరాలు రేపు పూజ కార్యక్రమంలో వెలువడనున్నాయట. ఒకరకంగా ఈ సినిమాని బాలయ్య ఫ్యాన్స్ కు ఒక కనుకగా గుర్తుండిపోయేలా తీయాలని రవికుమార్ భావిస్తున్నారట. 

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జైసింహా హిట్ అయినప్పటికీ, అభిమానుల అంచనాలను మాత్రం పూర్తి స్థాయిలో అందుకోలేదనే విమర్శ వెలువడడంతో ఈసారి తీయబోయే సినిమా తప్పకుండా బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉండాలని అయన పక్కాగా స్క్రిప్ట్ ని రెడీ చేశారట. త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సినిమాని సంక్రాంతి కానుకగా 2020లో విడుదల చేయాలని భావిస్తున్నారు. కాగా ఇందులో వాస్తవాలు ఎంతున్నాయి అనేది ప్రక్కన పెడితే ఈ వార్త ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: