ప్రముఖ సినీ నటుడు, రచయిత గిరీశ్ కర్నాడ్ నిన్న తుదిశ్వాస విడిచారు.  ఆయన మరణం యావత్ సినీ ఇండస్ట్రీ షాక్ కి గురైంది.  నటుడిగానే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు.  సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించారు.   1970లో వ‌చ్చిన సంస్కార చిత్రంలో ఆయ‌న న‌టించి ప్ర‌త్యేక ప్ర‌శంస‌లు పొందారు.

న‌షాంత్‌, మంథ‌న్‌, డోర్ అండ్ స్వామి లాంటి హిందీ చిత్రాలోనూ న‌టించారు. 1971లో రిలీజైన వంశ‌వృక్షం, 1984లో వ‌చ్చిన ఉత్స‌వ్‌ చిత్రాల‌ను ఆయ‌న డైర‌క్ట్ చేశారు.  గిరీశ్ క‌ర్నాడ్ రాజ‌కీయాల్లోనూ కీల‌క పాత్ర పోషించారు. మ‌త‌ఛాంద‌స‌వాదుల‌ను ఆయ‌న తీవ్రంగా విమర్శించేవారు. ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ‌భూషణ్‌, జ్ఞాన‌పీఠ్ అవార్డుల‌ను ఆయ‌న అందుకున్నారు. 

గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల కర్ణాటక సీఎం కుమారస్వామి సంతాపం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం భావించింది. అయితే కర్నాడ్ కుటుంబ సభ్యులు ఇందుకు ఒప్పుకోలేదు. దీనికి కారణం ఆయన చివరి కోరిక తన అంతిమ సంస్కారాలు సాదా సీదాగా తన కుటుంబ సభ్యుల మద్యలోనే జరిపించాలని అన్నారట.

అంతిమయాత్రలో అభిమానులు, పోలీసు బలగాలు కూడా వద్దన్నారని చెప్పారు. ఆయన కోరికను గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే గిరీశ్ కర్నాడ్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు ఆయన కోరుకున్నట్లుగానే జరిపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: