మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందుతోంది. బ్రిటీష్ సైన్యాన్ని గడ గడలాడించిన మొదటి తెలుగు స్వతంత్ర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆయన తనయుడు నిర్మాత, హీరో రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. మరో ముఖ్యమైన యువరాణి పాత్రలో తమన్నా నటించారు. ఆ మద్య తమన్నా పుట్టిన రోజు సందర్బంగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే కథా నేపథ్యంలో తమన్నా యువరాణి కాస్ట్యూమ్స్ లో చాలా రిచ్ గా కనిపించబోతుందట. తాజాగా తన పాత్ర గురించి తమన్నా మాట్లాడుతూ..నా పాత్రకి తగినట్టుగా నేను భారీ లెహెంగాలను ధరించాను. నేను ధరించిన వస్త్రాలను చిరంజీవిగారి పెద్ద కుమార్తె సుస్మిత .. ప్రముఖ డిజైనర్ అంజూ మోదీతో కలిసి డిజైన్ చేశారు.
ఆమె చేసిన కాస్ట్యూమ్స్ డిజైన చూస్తుంటే నిజంగా పిచ్చెక్కించేలా ఉందని సుస్మితను తెగ పొగిడేస్తుంది తమన్నా. సుస్మిత ఖైదీ నెంబర్ 150 చిత్రానికి కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, సుదీప్ , జగపతి బాబు ప్రత్యేక పాత్రలలో కనిపించనున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని చెబుతున్నారు.