కిమ్ శర్మ... ఒకప్పుడు టాలీవుడ్ లో అనేక సినిమాలు చేసింది. బాలీవుడ్ లో కూడా మెరుపులు మెరిపించింది. సినిమాలు చేస్తున్న సమయంలోనే ఈ భామ యువరాజ్ సింగ్ ప్రేమలో పడింది. ప్రేమలో పడటమే కాదు.. చాలాకాలం ఈ ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారు.
కొంతకాలం పాటు సహజీవనం కూడా చేశారు. అయితే, ఏమైందో ఏమో తెలియదుగాని, సడెన్ గా వీరిద్దరూ విడిపోయారు. విడిపోయాక యువరాజ్ సింగ్.. హేజల్ కీచ్ ను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. కిమ్ విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది.
కెన్యాకు చెందిన బిజినెస్ మెన్ ను కిమ్ వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న కొన్నాళ్ళు అభిప్రాయం భేదాల కారణంగా విడిపోయారు. ఇక యువీ క్రికెట్ నుంచి రిటైర్ ప్రకటించాక యువిని ప్రశంసలతో ముంచెత్తింది.
వెల్ ప్లేయ్డ్ యువరాజ్ సింగ్. క్రికెట్ లో ఎన్నో మరపురాని అద్భుత క్షణాలను అందించినందుకు నీ ఆటకు ఇదే మా స్టాండింగ్ ఒవేషన్. హేజల్ కీచ్ తో మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను.. అని ట్వీట్ చేసింది.