తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాహుబలి తర్వాత మళ్ళీ అంతే ప్రతిష్ఠాత్మకంగా ఇంటర్‌నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న సినిమా సైరా. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సైరా-నరసింహారెడ్డి టాకీ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలనుకున్నప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతున్న కారణంగా ఆగస్టు బరిలో ఉంటుందా లేదా? అన్నది అటుంచితే విజయదశమికి ఖాయంగా రిలీజవుతుందని మెగాభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 


మెగాస్టార్ కెరీర్ 151వ సినిమా ఎలా ఉండబోతోంది?  బాహుబలి తరహాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రికార్డులు సృష్టించబోతోందా? అంటూ అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఒక్క టాలీవుడ్‌లోనే కాదు సైరా కోసం బాలీవుడ్, కోలీవుడ్‌లోను ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచుస్తూన్నారు. అందుకు తగ్గట్టే మెగాస్టార్ ఎక్కడా తగ్గలేదని ఇంతకముందే రిలీజైన టీజర్ చూసిన అందరికి అర్థమైంది. ఇక ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ఇంటర్నేషనల్ స్టాండార్డ్స్ కోసం బాగా శ్రమిస్తోంది. నాన్న కోసం అన్ లిమిటెడ్ బడ్జెట్ పెడతానని నిర్మాత రామ్ చరణ్ ప్రకటించడంతోనే అందరికీ అర్థమైంది.  


అయితే ఈ సినిమా ఎలా ఉండబోతోంది? అన్న మెగా ఫ్యాన్స్ ప్రశ్నకి ఇంతవరకూ చిత్రయూనిట్ నుంచి సరైన సమాధానం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. అయితే సీనియర్ నటుడు, రచయిత, దర్శకులు తనికెళ్ల భరణి మాత్రం ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్య టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. సైరా మెగాభిమానుల అంచనాల్ని మించి ఉంటుందని .. సైరా సరికొత్త చరిత్రను సృష్టిస్తుందని అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచుతుందని పొగిడేశారు. ఇక సైరా భరణి ఓ కొత్త తరహా పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: