తెలుగు డబ్బింగ్  సినిమాలకి హిందీలో మాంచి గిరాకీ ఉంది. యూట్యూబ్ లో విడుదలయిన వెంటనే లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. ముఖ్యంగా యాక్షన్ సినిమాలకైతే మరీనూ. తాజాగా వరుణ్ తేజ్ కంచె హిందీలోకి ’కిలాడీ కి జంగ్ ’ పేరుతో  అనువాదమయ్యింది.

ఆదిత్య మ్యూజిక్ ఛానల్ ద్వారా హిందీలోకి అనువాదమయ్యిన ఈ సినిమా కేవలం మూడురోజుల్లోనే నాలుగు మిలియన్ల వ్యూస్ రాబట్టుకుని యాభై లక్షల వ్యూస్ కి చేరువలో ఉంది.  ఇన్ని వ్యూస్ రావడానికి ముఖ్య కారణం క్రిష్.

క్రిష్ బాలీవుడ్ జనాలకి పరిచయం అక్కర్లేని పేరు. మణికర్ణిక సినిమా వివాదంలో క్రిష్ పేరు అందరికీ తెలిసిపోయింది. మణికర్ణిక దర్శకుడే ఈ సినిమాని డైరెక్ట్ చేసాడనే టాక్ కూడా ఈ సినిమాకి అన్ని వ్యూస్ రాబట్టగలిగింది.

ఇక రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో  జరిగిన కథతో రూపొందిన ఈ చిత్రం బాలీవుడు జనాలని విశేషంగా రాబట్టుకుంది. ఇంతటి ప్రతిభావంతుడైన డైరెక్టర్ ని పట్టుకుని కంగనా రనౌత్ అసలు డైరెక్షన్ రాదన్నట్టు మాట్లాడింది అంటూ కంగనాని తిట్టిపోస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: