అనుపమ పరమేశ్వరన్. కన్నడ బ్యూటీ. ముద్దబంతి పూవులా ఉంటుంది. ఫుల్ ట్రెడిషనల్ లుక్ తో కనిపిస్తుంది. వేసింది కూడా ఆ టైప్ పాత్రలే ప్రేమమ్  మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ మీద ఇపుడు  ఓ  హాట్ న్యూస్ గుప్పుమంటోంది. అనుపమ అంటే మహా బుద్ది గురూ అనేట్టు ఉండే ఈ పిల్లకు ఇంత సీన్ ఉందా.


విషయానికి వస్తే ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దక్షిణాది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో ఆటను డేటింగ్ చేస్తున్నట్టు సోషల్ మీడియా గుప్పుమంటోంది.  అందుకు కారణం బుమ్రా తన ట్విట్టర్ ఖాతాలో ఫాలో అవుతున్న సెలబ్రిటీల్లో లేడీ సెలబ్రిటీ అనుపమ ఒక్కటే ఉండటం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. 


 మరి నిజంగానే వీరి మధ్యన ప్రేమాయణం నడుస్తోందా లేకపోతే ఇవన్నీ ఒట్టి రూమర్లు మాత్రమేనా అనేది ఇరువురిలో ఎవరో ఒకరు స్పందిస్తేనే తెలుస్తుంది. ఇక అనుపమ తెలుగులో చాలా సినిమాలు చేసినా ఆమె మీద ఎలాంటి రూమర్లు రాలేదు. ఆమె మంచి నడవడి కలిగిన అమ్మాయి అని అంతా ఓటేశారు. మరి ఇది కూడా అలాగే రూమర్ గా తేలిపోతుందా లేక నిజంగానే ఏమైనా అఫైర్ ఉందా అన్నది చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: