ఇదేంటి ఇలా అంటారు అనుకుంటున్నారా ఇది నిజం అండి.. ఎంత ప్రగల్బాలు పలికినా... ఇంటికి వెళ్లే సరికి కామ్ అయిపోతారు.  ఇలాంటి విషయాలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  అది ఎక్కడైనా సరే.. ఏ ఇండస్ట్రీలో అయినా సరే.. ఇది మామూలే. 

ఇలాంటి సంఘటన దీపికా విషయంలో జరిగింది.  దీపికా పదుకొనె ఏరికోరి ప్రేమించి రణ్వీర్ సింగ్ ను వివాహం చేసుకుంది.  చేసుకున్నాక ఇద్దరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.  ఇది వేరే విషయం అనుకోండి. ఇద్దరు కలిసి ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు.  అదే కపిల్ బయోపిక్ 83.  ఈ సినిమా కోసం ఈ ఇద్దరు బాగా కష్టపడుతున్నారు.  

సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటె రీసెంట్ గా రణవీర్ సింగ్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  చాలా ఫన్నీగా ఉన్నా,  ఆకట్టుకునే విధంగా ఉండటం విశేషం.  సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు ఇలాంటి హైప్ క్రియేట్ చేస్తున్నారు.  

ఇదిలా ఉంటె, 83 సినిమాలో ఈ ఇద్దరు కపుల్స్ గా నటిస్తున్నారు.  ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఫన్నీ సీన్ క్రియేట్ చేశారు.  దీపికా తన బ్యాట్ తో రణ్వీర్ ను కొడుతోంది.. దీంతో రణ్వీర్ పైకి ఎగురుతాడు.  ఈ సీన్ సూపర్బ్ గా ఉంది.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: