ఇదివరకు సినిమాలపరంగా ఏ సినిమా అత్యధిక థియేటర్లలో ఎక్కువరోజులు రన్ అయితే దానిని పెద్ద హిట్ గా భావించేవారు. అయితే అటువంటి రోజులు ఇప్పుడు లేవు, ఇప్పుడు విడుదలవుతున్న సినిమాల్లో ఏ సినిమా అయితే ఎంత ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుందో దానినే పెద్ద హిట్ గా భావించడం జరుగుతోంది. ఇకపోతే ఇటీవల వచ్చిన బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత ఈ బాక్సాఫీస్ లెక్కలు పట్టించుకోవడం మరింత ఎక్కువ అయింది. ఇక మన తెలుగు సినిమా ప్రేక్షకులు అయితే ఎప్పటికపుడు ఏ సినిమా ఎక్కడెక్కడ ఎంత మేర వసూలు చేసింది అంటూ చర్చించుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే బాహుబలి సినిమాలను కాసేపు ప్రక్కన పెడితే ఇప్పటివరకు విడుదలైన తెలుగు సినిమాల్లో అత్యధిక కలెక్షన్ రాబట్టిన చిత్రంగా రంగస్థలం మొదటి వరుసలో నిలిచింది. 

ఆ సినిమా ఓవర్ ఆల్ గా రూ.116 కోట్ల షేర్ రాబట్టి నాన్ బాహుబలి రికార్డుని నెలకొల్పడం జరిగింది. అయితే ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మహేష్ బాబు మహర్షి సినిమా ప్రస్తుత పరిస్థితుల్లో రంగస్థలం రికార్డుని అందుకోవడం కష్టం అనే అంటున్నారు. అయితే నాన్ బాహుబలి రికార్డు కాకుండా ఇండివిడ్యుయల్ గా ఒక హీరో రూ.125 నుండి రూ.150 కోట్లవరకు షేర్ సాధించగల సత్తా ఎవరికి ఉంది అనే విషయమై కొద్దిరోజలుగా సోషల్ మీడియా మాద్యమాల్లోను, అలానే సినీ వర్గాల్లోనూ విపరీతంగా చర్చ జరుగుతోంది. నిజానికి మహర్షికి తొలి రోజు కాస్త మిక్స్డ్ టాక్ రావడం వలన అక్కడే ఆగిపోయింది కానీ, లేకపోతే ఇప్పటికే రూ.125 కోట్ల మార్క్ షేర్ అందుకునేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అయితే నిజానికి ప్రస్తుతం వున్న ట్రెండ్ లో దాదాపుగా రూ.125 కోట్ల పైబడి షేర్ ని అందుకోగల సత్తా అయితే మహేష్ లేదా పవన్ సినిమాలకే ఉందటున్నారు విశ్లేషకులు. 

నిజానికి రెబల్ స్టార్ ప్రభాస్ కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రేజ్ మరియు మార్కెట్ పెరిగినప్పటికీ అయనను బాహుబలి స్టార్ గానే చూస్తూ ఈ లెక్కల్లో చేర్చడం లేదు. అయితే ప్రభాస్ కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలు సహా మిగతా ప్రాంతాలు అన్నిట్లో సమానమైన ఇమేజి మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన మహేష్ లేదా పవన్ సినిమాలు మంచి హిట్ టాక్ ని కనుక సంపాదిస్తే ఆ మార్క్ ని అందుకోవడం ఎంతో సులభమనేది వారు చెప్తున్న మాట. మరి వారు భావిస్తున్నట్లు అది వారిద్దరి వల్లనే వీలవుతుందా లేదా మరెవరైనా ఆ ఫీట్ ని అందుకుంటారా అనేది రాబోయే రోజుల్లో కానీ తెలియదు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: