యాంగ్రీ మాన్ రాజశేఖర్  ’గరుడవేగ’ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చారు. ఆ సినిమా విజయం ఇచ్చిన జోష్ తో "అ" సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో  సినిమా కుదుర్చుకున్నాడు. అదే "కల్కి" ఈ మధ్య వచ్చిన టిజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  

గరుడవేగ సినిమాలో హాట్ ఐటెమ్ సన్నీలియోని తో డియ్యో డియ్యో అంటూ స్టెప్పులు వేయించారు. ఆ పాట సినిమాకి ఎంత మైలేజ్ తీసుకొచ్చిందో అందరికి తెలిసిందే. సినిమా విజయంలో ఆ పాట చాలా మేలు చేసింది.

ఇప్పుడు కల్కిలో కూడా అదే ఫార్మూలని వాడుతారట. ఈ సినిమాలో ప్రత్యేక గీతం కోసం బ్రిటీష్ నటీమణి స్కార్లెట్ విల్సన్ తో  యాంగ్రీ స్టార్ స్టెప్పులు వేయబోతున్నాడు. ఆ పాటకి ’హార్న్ ఓకే ప్లీజ్’ అని పేరు కూడా పెట్టారు.

ఈ లిరికల్ సాంగ్ ని యూట్యూబ్ లో  12 తారీఖు సాయంత్రం 5 గంటలకి విడుదల చేస్తారు. స్కార్లెట్ విల్సన్ అంటే ఎవరో కాదు. ఆమె ఇంతకుముందు ’ఎవడు’ సినిమాలో ఒక పాటలోనూ, బాహుబలి సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా రెచ్చిపోయి చేసింది. మరి రాజశేఖర్ పక్కన ఎటువంటి స్టెప్పులేస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: