ఒక సినిమా విజయానికి కావాల్సిన వాటిలో మంచి కథ, కథనం, దర్శకుడి ప్రతిభ , నిర్మాణ విలువలే కాకుండా సినిమా రిలీజ్ సమయం కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. చిన్న, మధ్య స్థాయి సినిమాలన్నీ జూన్ లోనే విడుదలకి సిద్ధమవుతున్నాయి.

స్టార్ హీరో సినిమాలేవి లేకపోవడంతో థియేటర్లు అందుబాటులో ఉంటున్నాయి. అందుకని నిర్మాతలు  ఇదే మంచి సమయం అనుకుని రిలీజ్ డేట్ కన్పర్మ్ చేస్తున్నారు.

మరీ ముఖ్యంగా జూన్ 21 వ తేదీకి డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పటికే మల్లేశం, ఫస్ట్ ర్యాంక్ రాజు, కెప్టెన్ రాణా ప్రతాప్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఇలా నాలుగు సినిమాలు జూన్ 21 న రానున్నాయి.

తాజాగా మంచు విష్ణు "ఓటరు" సైతం జూన్ 21 న విడుదలకి సిద్ధంగా ఉందని ఆ చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే తెలిపింది. కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తమిళంలో కృనాల్ అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. మంచు విష్ణుకి జోడీగా సురభి నటించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: