స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథతో చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం " సైరా".కొణిదెల ప్రొడక్షన్ నిర్మాణ సంస్థలో రామ్ చరణ్ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశల్లో ఉంది. అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం కోసం అనేక మంది టెక్నీషియన్లు,నిపుణులు పనిచేస్తున్నారు.వారిలో చిరు పెద్ద కుమార్తె సుస్మిత కూడా ఉన్నారు.

స్వతహాగా సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్. గతంలో కొన్ని సినిమాల్లో చిరంజీవి కాస్ట్యూమ్ బాధ్యతల్ని తనే నిర్వహించారు. ఖైదీ నంబరు ౧౫౦ సినిమాలో చిరంజీవి అంత స్టైలిష్ గా కనిపించడానికి కారణం సుస్మితే.

ఇప్పుడు సైరాలో  తమన్నా పాత్రకి దుస్తుల్ని డిజైనర్ అంజు మోదీతో కలిసి సుస్మిత డిజైన్ చేశారు. ఆ దుస్తుల గురించి తమన్నా మాట్లాడుతూ తన కెరీర్లో ధరించిన  అత్యంత ఖరీదైన కాస్ట్యూమ్స్ ఇవేనని పేర్కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: