స‌ప్త‌గిరి బొమ్మరిల్లు చిత్రంతో కమెడియన్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి  అనతికాలంలోనే జూనియర్ బ్రహ్మానందంగా పేరు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ స్పీడ్‌తో వరుస చిత్రాలు చేస్తూ తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. జీవితంలో స్థితిగతుల్లో మార్పు ఉండాలనే లక్ష్యంతో సప్తగిరి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో హీరోగా మారారు. విజయాన్ని అందుకొని హీరోగా మంచి పేరు సంపాదించుకొని ఇటు క‌మెడియ‌న్‌గా అటు   హీరోగా  మంచి పేరును సంపాదించుకున్నారు. తాను హీరోగా వ‌చ్చిన మొద‌టి చిత్రం సప్తగిరి LLB. హిందీలో ఘనవిజయం సాధించిన జాలీ LLB చిత్రానికి  రీమేక్. 


కమెడియన్ గా తెలుగు తెరపై సందడి చేసిన సప్తగిరి, హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హీరోగా నిలదొక్కుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'వజ్రకవచధర గోవింద' ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నారు. వైభవీ జోషీ కథానాయిక. అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, వీరేన్ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో సప్తగిరి స్వామీజీ వేషధారణలో కనిపించారు.  స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌తో మంచి హిట్ కొట్టిన ఆయ‌న స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బితో ప‌ర్వాలేదు అనిపించుకున్నారు. ప్ర‌స్తుతం చేయ‌బోయే వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర‌గోవింద చిత్రంతో ప్రేక్ష‌కుల‌కు మ‌రోసారి త‌న స‌త్తా చూప‌డానికి వ‌స్తున్నారు. ఆయ‌న ఇంకా ఇలానే మ‌రెన్నో చిత్రాల్లో న‌టించి అటు క‌మెడియ‌న్‌గానూ, ఇటు హీరోగానూ మంచి హిట్ల‌ను సాధించాల‌ని కోరుకుందాం అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: