రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటి వరకు తెలుగులో చాలా సినిమాలు చేసింది.  ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  గత కొంతకాలంగా రకుల్ ప్రీత్ సినిమాల విషయంలో కొంత ఇబ్బంది పడుతోంది.  మంచి హిట్స్ లేక రేస్ లో వెనకబడింది.  బాలీవుడ్ లో దే దే ప్యార్ దే  సినిమా సూపర్ హిట్ కావడంతో.. రకుల్ ప్రీత్ సింగ్ మరలా లైన్లోకి వచ్చింది.  


సినిమా సంగతి ఎలా ఉన్నా, ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు చాలా స్పీడ్ గా ఉంటుంది.  ప్రతిరోజూ ఎదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ దూసుకుపోతున్నది.  రీసెంట్ గా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది.  దీనిపై నెటిజన్లు అనేక కామెంట్స్ చేశారు.  


ఈ కామెంట్స్ పై ఓ ఇంగ్లీష్ పత్రిక ఆమెను ప్రశ్నించగా... ఈ కామెంట్స్ పై స్పందించనని,ఇలాంటి వి అనేకం వస్తుంటాయని,  వాటికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని సెలిచ్చింది.  అంతేకాదు, వీటికి రిప్లయ్ ఇస్తే.. దాని వలన మరో 100 కామెంట్స్ వస్తాయని, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం అనవసరమనిచెప్పింది .  


తెలుగులో మన్మధుడు 2 సినిమా చేస్తున్నది.  అలాగే బాలీవుడ్ లో రిలీజైన దే దే ప్యార్ దే సినిమాకు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇందులో వెంకటేష్ కు ప్రియురాలిగా నటిస్తున్నట్టు సమాచారం.  ఈ రెండు సినిమాలతో పాటు ఈ అమ్మడి చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: