రణ్వీర్ సింగ్.. దీపికా పదుకొనె హాట్ జంట.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  ఈ ఇద్దరు కలిసి మూడు సినిమాలు చేశారు.  అందులో రామ్ లీలా, బాజీరావు మస్తానీ సినిమాల్లో దీపికా, రణ్వీర్ లు క్లైమాక్స్ లో మరణిస్తారు .  


అలాగే, రీసెంట్ గా చేసిన పద్మావతి సినిమాలో రణ్వీర్ సింగ్ విలన్ రోల్ ప్లే చేశాడు.  ఇందులో కూడా క్లైమాక్స్ లో దీపికా మరణిస్తుంది.  విలన్ కాబట్టి రణ్వీర్ కూడా మరణిస్తాడు.  ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  


యాంటి క్లైమాక్స్ అయినప్పటికీ ఈ సినిమాలకు మంచి క్రజ్ వచ్చింది.  ప్రస్తుతం ఈ ఇద్దరు 83 అనే సినిమాలో చేస్తున్నారు.  ఇండియన్ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా 83 మూవీ తీస్తున్నారు.  అప్పట్లో ఇండియన్ జట్టు వరల్డ్ కప్ ను ఎలా గెలుచుకుంది అన్నది ప్రధానాంశం.  


ఈ సినిమాలో రణ్వీర్ దీపికాలు నటిస్తున్నారు.  ఈ సినిమాలో ఇద్దరం చివర్లో కూడా బ్రతికే ఉంటాం అని చెప్పడంతో అందరు షాక్ అయ్యారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: