ఈరోజు ఉదయం విడుదలైన ‘సాహో’ టీజర్ హాలీవుడ్ మూవీల స్థాయిలో మేకింగ్ కనిపిస్తోంది అంటూ ప్రశంసలు కురిపిస్తూనే మధ్యలో ఈమూవీ కథ పై 2007 లో వచ్చిన మహేష్ సురేంద్ర రెడ్డిల కాంబినేషన్ లో వచ్చిన ఫ్లాప్ మూవీ ‘అతిథి’ కథ లైన్ ‘సాహో’ కథ లైన్ కు పోలిక ఉందా అంటూ కొందరు సందేహాలు బయటపెడుతున్నారు. వాస్తవానికి ఇలాంటి పోలికలు రావడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది.

కేవలం నిమిషంన్నర మాత్రమే ఈ టీజర్ ఉన్ననేపధ్యంలో కథను ఎక్కడా లీక్ చేయకుండా చాల జాగ్రత్తలు తీసుకుని ఎక్కువగా విజువల్స్ పైనే శ్రద్ధ పెట్టారు. అయితే ఈ టీజర్ ను శ్రద్ధగా పరిశీలిస్తే ఎవరు లేని ఓ అమ్మాయి హీరోయిన్ శ్రద్ధ కపూర్ కు నేనున్నా అంటూ అండగా నిలబడే ప్రేమికుడి పాత్రలో ప్రభాస్ ను చూపెడుతూ ఆమె కోసం ప్రాణాలు పణంగా పెట్టి శత్రువుల నుండి ప్రియురాలిని కాపాడటం కోసం ప్రపంచాన్నే ఎదిరించెందుకు సిద్ధపడే సాహసవంతుడుగా ప్రభాస్ ను చూపెట్టారు.

అయితే ఈ టీజర్ ను చూసిన వారికి మహేష్ ‘అతిథి’ సినిమా లైన్ గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో కూడ హీరోయిన్ అమృతా రావ్ ను చంపడానికి ప్రయత్నంచే కనిపించని శత్రువులతో మహేష్ ప్రియురాలి కోసం పోరాటం చేస్తూ అమృతా రావ్ ను రక్షించుకుంటాడు. 

అయితే విజువల్స్ పరంగా ‘అతిథి’ మూవీ ‘సాహో’ అంత రిచ్ గా ఉండదు. కానీ స్టోరీ లైన్ విషయంలో మాత్రం ‘సాహో’ కు ‘అతిథి’ కనిపించని సారూప్యత ఉందా అని కొందరు విశ్లేషకుల సందేహం. వాస్తవానికి ఒకే స్టోరీ లైన్ మీద వచ్చిన సినిమాలు గతంలో చాల వచ్చాయి. దీనితో ‘సాహో’ మేకింగ్ విషయంలో అత్యంత భారీ తనం స్టోరీ విషయంలో సింపుల్ గా కనిపిస్తూ ఇప్పటికే ఈమూవీ కథ విషయంలో అద్భుతాలు ఉండవు అన్న సందేహాలను నిజంగానే నిజం అవుతుందా అన్న కామెంట్స్ ‘సాహో’ టీజర్ పై వస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: