యాక్షన్ సినిమా అంటే హాలీవుడ్ గురించే చెప్పుకునేవాళ్ళం.  సినిమా అంటే 007 లా ఉండాలి.. సినిమా అంటే రాంబో లా ఉండాలి.. సినిమా అంటే అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పుకోవడమే కానీ, ఆ దిశగా అడుగులు వేసింది మాత్రం లేదు.  బాహుబలి సినిమా ఆ దిశగా అడుగులు వేసినా అది మైతిలాజికల్ స్టోరీ సినిమా కావడంతో దాన్ని ఆ దృష్టితో చూడలేదు.  


ఇప్పుడు ప్రభాస్ సాహో అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  హాలీవుడ్ ప్రమాణాలు ఏ మాత్రం తక్కువ కాకుండా టీజర్ ను కట్ చేశారు.  కేవలం యాక్షన్ సీన్స్ పైనే దృష్టి పెట్టి టీజర్ ను కట్ చేసిన విధానం బాగుంది.  


పెట్టిన ఖర్చుకు ఫలితం టీజర్ లో స్పష్టంగా కనిపించింది.  టీజర్ ఎండింగ్ లో ఎడారిలో నుంచి ఇసుక అలా లేచి వస్తుంటే మమ్మి సినిమా గుర్తుకు వస్తుంది.  గాల్లోకి కారులు ఎగిరిపడి ఎపిసోడ్ కాస్త మైనస్ పాయింట్ గా కనిపిస్తోంది.  ఎందుకంటే అది చూడటానికి వీడియో గేమ్ ఉన్నట్టుగా ఉంది.  


మొత్తానికి సినిమా టీజర్ విజువల్ పరంగా వండర్ అనిపించే విధంగా ఉండటం విశేషం.  టీజర్ సినిమాపై నమ్మకం కలిగించింది.  ఇది కేవలం శాంపిల్ మాత్రమే.  ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాలో బోలెడు ఉన్నాయని అంటున్నారు.  మరి చూద్దాం ఎలా ఉంటుందో. 


మరింత సమాచారం తెలుసుకోండి: