యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో సినిమా టీజ‌ర్ గురువారం అనుకున్న ముహూర్తానికే రిలీజ్ అయ్యింది. టీజ‌ర్ వ‌చ్చి రావ‌డంతోనే రికార్డుల దుమ్మ దులిపేస్తోంది. యూట్యూబ్‌లో సాహో టీజ‌ర్‌కు అదిరిపోయే వ్యూస్ వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే సాహో ప్రి రిలీజ్ బిజినెస్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల రైట్స్ మాత్ర‌మే రూ.20 కోట్లు ప‌లికాయ‌ట‌. రేటు ఎక్కువే అయినా సినిమాపై ఉన్న బ‌జ్‌తో ఆ డిస్ట్రిబ్యూట‌ర్ ఈ రేటుకే రైట్స్ సొంతం చేసుకున్న‌ట్టు స‌మాచారం.


సీడెడ్ ఏరియాకు రూ. 25 కోట్ల మేర బిజినెస్ పూర్తయింది. క‌ర్ణాట‌క రైట్స్‌ను ఓ నిర్మాత‌, పంపిణీదారుడు రూ.27 కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ట్టు టాక్‌. ఇక నైజాం, వైజాగ్ ఏరియా రైట్స్‌ను అగ్ర నిర్మాత దిల్ రాజు రూ.42 కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ట్టు రూమ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఓవ‌రాల్‌గా ఆంధ్రాలో రైట్స్ రూపంలోనే రూ.60 కోట్లు యూవీ క్రియేష‌న్స్‌కు ద‌క్కుతున్నాయ‌ట‌. 


బాహుబ‌లి లాంటి సినిమాలే రూ.50 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి... సాహో కొన్ని చోట్ల బాహుబ‌లిని మించిన బిజినెస్ చేసి నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రాస్ చేయ‌నుంది. సాహో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 100 కోట్లు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తుండడం వేడెక్కిస్తోంది. సాహోను బాలీవుడ్‌లో టీ-సీరిస్ భూష‌ణ్‌కుమార్ రిలీజ్ చేస్తున్నారు. హిందీ రైట్స్ రూ. 80-90 కోట్ల మ‌ధ్య‌లో ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు.


ఏదేమైనా బాహుబ‌లికి రిలీజ్‌కు నెల రోజుల ముందు నుంచే ఎలాంటి సంచ‌ల‌నాలు, అంచ‌నాలు ఉన్నాయో ఇప్పుడు సాహోపై సైతం అదే రేంజులో అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి సినిమా రిలీజ్ అయ్యాక కూడా అదే అంచ‌నాలు అందుకుంటుంద‌ని ఆశిద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: