ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ప్రభాస్ సాహో టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  ఈ టీజర్ అనేక రికార్డులను బద్దలు కొట్టింది.  యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోయింది.  టీజర్ అంతా యాక్షన్ పార్ట్ తో నింపేశారు.  ఇలా యాక్షన్ పార్ట్ తో నింపేస్తే.. ఎలా.. 


కొంతమంది యాక్షన్ నచ్చుతుంది.  కొంతమంది కథ నచ్చుతుంది.  టీజర్ చూస్తున్న వాళ్లకు అందులో ఉన్న కథ ఏంటి అన్నది అర్ధంకాని విషయం.  అయితే, యాక్షన్ పరంగా ఈ టీజర్ హాలీవుడ్ మూవీస్ కు తీసిపోకుండా ఉన్నది అనడంలో సందేహం లేదు. 


అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు కథను చాలా వీక్ గా ఎంచుకున్నాడు.  తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన రౌడీకోసం స్పై గా మారి వాళ్ళను ఎలా ఎదుర్కొన్నాడు అనే కథతో సినిమా తీశారని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు.  


నిజానిజాలు పక్కన పెడితే.. కేవలం యాక్షన్ కోసమే దాదాపుగా 90 కోట్ల రూపాయలకు పైగా కేటాయించారు.  అంత భారీగా ఖర్చు చేశారు కాబట్టి ఈ సినిమా ఇలా వచ్చింది.  కథ సింపుల్ గా ఉన్నా కథను నడిపిన తీరు బాగుంది అంటే సినిమాకు డబ్బులు వస్తాయి.  ఏదైనా తేడా కొట్టింది అంటే గోవిందా గోవిందా.. 


మరింత సమాచారం తెలుసుకోండి: