ఈ వారం ప్రేక్షకుల ముందుకు మూడు భాషలు కలిపి చెప్పుకోవడానికి పన్నెండు సినిమాలు వస్తున్నాయి. కాని అందులో విపరీతమైన ఆసక్తి రేపుతున్నవి మాత్రం తక్కువగా ఉండటం ట్రేడ్ ని కొంత ఆశ కొంత నిరాశ పరచే విషయం. తెలుగువరకు చూసుకుంటే విడుదలయ్యే నెంబర్ ను పక్కన పెడితే అంతో ఇంతో హైప్ తో వస్తున్న సినిమాలు రెండే. ఒకటి సప్తగిరి హీరోగా రూపొందిన 'వజ్రకవచధర గోవింద'. రెండోది తాప్సి 'గేమ్ ఓవర్'.  


ఓపెనింగ్స్ కీలకంగా ఉండే ఫస్ట్ డే ఎడ్జ్ సప్తగిరి వైపే ఎక్కువగా ఉంది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ కామెడీని ఎంజాయ్ చేసే ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్ కూడా 'వజ్రకవచధర గోవింద' వైపే మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంది. అందులోనూ సప్తగిరి.. 'సప్తగిరి ఎల్.ఎల్.బి ఆశించిన ఫలితం అందుకొకపోయినా 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' తాలుకు పాజిటివ్ వైబ్రేషన్స్ పబ్లిక్ లో ఇంకా ఉన్నాయి. అవి ఇప్పుడు వజ్రకవచధర గోవింద కు ప్లస్ గా మారుతున్నాయి. ఒకవేళ టాక్ కనక పాజిటివ్ గా వస్తే డీసెంట్ ఓపెనింగ్స్ తో పాటు రెండో రోజు నుంచే కలెక్షన్లు పెరగొచ్చు. 


మరోపక్క హారర్ కం సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న గేమ్ ఓవర్ మీద ఆ జానర్ ఆడియన్స్ మాత్రమే చూసే ఛాన్స్ ఉంది. 'ఆనందో బ్రహ్మ' 'నీవెవరో' సినిమాలతో ఈ మధ్య తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్న తాప్సీ ఇందులో అంతా తానై నటించడం ప్లస్ ట్రైలర్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయనే మెసేజ్ ఇవ్వడం కొంతవరకు తాప్సీ సినిమాపై ఆసక్తిని పెంచే అంశం. అయితే వజ్రకవచధర కి ముందు చెప్పినట్టు ఎడ్జ్ కాస్త ఎక్కువ ఉంది. గేమ్ ఓవర్ కనక పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంటే లాభ పడవచ్చు. కాని ఇది డబ్బింగ్ సినిమా కావడం కొంత ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ఈ సినిమాలు రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకొని రెండు రోజులు ఆడితేగాని ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: