నిన్నవిడుదలైన ‘సాహో’ టీజర్ తన సంచలనాలను కొనసాగిస్తూ టాప్ హీరోల సినిమా టీజర్ రికార్డులకు చెక్ పెడుతోంది. ఇలాంటి పరిస్థుతులలో ఈటీజర్ పై ప్రముఖుల ప్రశంసలు లభిస్తున్న నేపధ్యంలో ఈమూవీ దర్శకుడు సుజిత్ ఒక జాతీయమీడియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమూవీ కథలోని విషయాల పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

‘సాహో’ మూవీ అందరూ అనుకుంటున్నట్లుగా ఒక సూపర్ హీరో మూవీ కాదనీ కేవలం ఈమూవీలో నటించిన ప్రభాస్ మాత్రం తనకు సూపర్ హీరో అంటూ ఈమూవీలో చెప్పుకోతగ్గ గొప్ప కథ ఉండదు అన్నవిషయాన్ని అంతర్లీనంగా సుజిత్ లీకులు ఇస్తున్నాడు. అయితే ‘బాహుబలి’ తరువాత రాబోతున్న ప్రభాస్ మూవీ కాబట్టి ఈమూవీ విషయంలో తన దృష్టి అంతా ప్రభాస్ పైనే ఉంది కానీ సినిమా కథ గురించి తాను పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు అన్నవిషయాన్ని సుజిత్ పరోక్షంగా అంగీకరిస్తున్నాడు.

ఇక ఈమూవీ టీజర్ శ్రద్ధా కపూర్ తో ప్రారంభం అయిన విషయాన్ని గురించి వివరిస్తూ తన మొదటి సినిమా ‘రన్ రాజా రన్’ తీస్తున్న సమయంలోనే తాను తన తల్లికి సినిమాలో  హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత లేకుండా కేవలం గ్లామర్ డాల్ గా చూపెట్టను అని ప్రామిస్ ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆ ప్రామిస్ కు తగ్గట్టుగానే ఈమూవీలో శ్రద్ధా కపూర్ పాత్ర ఉంటుంది అన్న లీకులు ఇస్తున్నాడు. అంతేకాదు ఈమూవీలోని ప్రతి పాత్రకు ఒక ప్రాముఖ్యత ఉంటుందనీ కేవలం ఇమేజ్ కోసం తాను ఈమూవీలో అనేకమంది బాలీవుడ్ స్టార్స్ ను ఎంపిక చేయలేదు అని అంటున్నాడు సుజిత్.

అయితే ఈమూవీ నిర్మాణంలో ప్రభాస్ తనకు ఇచ్చిన సహకారం గురించి మాట్లాడుతూ ప్రభాస్ లేకుంటే ఈసినిమా లేదనీ ఒక యంగ్ డైరెక్టర్ అని చూడకుండా తనకు ఏది అవసరం అనిపిస్తే అది చేయమని ప్రభాస్ తనకు ఇచ్చిన స్వేచ్చతో తాను ‘సాహో’ ను తీయగలిగాను అన్న అభిప్రాయాన్ని సుజిత్ వ్యక్తపరుస్తున్నాడు. తనకు ట్విటర్ ఫేస్ బుక్ లాంటి ఎకౌంట్స్ లేవనీ అలాంటివి పెట్టుకుని టెన్షన్ పడుతూ ప్రభాస్ తో తాను సినిమా చేయలేనని అందువల్ల తన ‘సాహో’ గురించి ప్రభాస్ అభిమానులు పెంచుకున్న అంచనాలు వింటే భయం వేస్తుంది కాబట్టి తాను సోషల్ మీడియా చూడటం మానేసాను అంటూ సుజిత్ చెపుతున్న మాటలు అతనిలోని టెన్షన్ ను సూచిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: