వైఎస్ జగన్ అప్రతిహతమైన మెజారిటీతో ఏపీ ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆయన యువకుడు. కొత్త రకం రాజకీయం చేస్తూ ఏపీని ముందుకుతీసుకుపోవాలనుకుంటున్న నేత. ఏపీకి సంబంధిచిన రాజకీయం చూస్తే సుదీర్ఘమైన, ఉజ్వలమైన భవిష్యత్తు జగన్ కి ఉందని అంతా భావిస్తున్నారు.


మరి అందరూ ఆశ్చర్యపోయేలా ల్యాండ్ స్లైడ్ డ్ విక్టరీని నమోదు చేసిన జగన్ అంటే సినీ రంగం  పెద్దలకు అంత చులకనా అన్న మాట ఇపుడు గట్టిగా వినిపిస్తోంది. జగన్ సీఎం అయి పదిహేను రోజులు గడచినా టాలీవుడ్ పెద్దలెవరూ ఈ వైపుగా తొంగి చూడకపోవడం కనీసం జగన్ని అభినందించకపోవడంపైన సర్వత్రా చర్చ సాగుతోంది.


టాలీవుడ్లో పెద్ద తలకాయలు ఇపుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయోనని అంతా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా జగన్ పట్ల టాలీవుడ్ చిన్న చూపు చూస్తోందని వైసీపీకి ప్రచారం చేసిన నటుడు ప్రుధ్వి అంటున్నారు. అయినా జగన్ కేమీ పరవాలేదని, ఆయన పాతికేళ్ళ సీఎం అంటూ కితాబు ఇచ్చారు. జగన్ విషయంలో సినీ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నా ఆయన అందరికీ మంచి చేస్తారని ప్రుధ్వి చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: