ఈ పిల్ల అందాలకు జిమ్ బయట ఇంటి బయట కాపలా పెట్టాల్సిందే!
మరిన్ని

ఈ పిల్ల అందాలకు జిమ్ బయట ఇంటి బయట కాపలా పెట్టాల్సిందే!

అతిలోక సుందరి ముద్దులతనయ బాలీవుడ్లో తొలి సినిమాతో విజయ వీచికలు సాగరకెరటాల్లా ఎగసిపడ్డాయి. సరిగ్గా నాలుగేళ్ల క్రితం జాన్వీ కపూర్ డెబ్యూ గురించి అప్పుడప్పుడే ప్రచారం మొదలైంది. మీడియా దృష్టి అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టీ జాన్వీ కపూర్ పైకి మళ్లింది అప్పుడప్పుడే కావడంతో మరీ అంతగా న్యూస్ ఫోకస్ కాలేదు. అప్పటికి 'జాన్వీ పబ్లిక్ అప్పియరెన్స్' కూడా అంతంత మాత్రమే. ముంబైలో ఏదైనా ఫేజ్-3 ఫంక్షన్ జరిగితే అక్కడ తన తల్లి శ్రీదేవితో పాటు కనిపించేది. సిస్టర్ ఖుషీ కపూర్ తో ఆడుకుంటూ కనిపించేది. అప్పటికి ఇప్పటికి జాన్వీలో మార్పు మామూలుగా లేదు.


ఫేజ్-3 వరల్డ్ లో ఎలా దూసుకొని వెళ్ళాలో జాన్వీ కపూర్కి అతిలోక సుందరి శ్రీదేవి ఎప్పటికప్పుడు అప్డేట్ టిప్స్ చెబుతున్నారని అంటూ ప్రచారమైంది. అన్నింటిని మించి బాలీవుడ్ గ్రేట్ ధర్మా ప్రొడక్షన్స్ అధినేత ఫిలిం మేకర్ కరణ్ జోహార్ ప్రత్యేకించి జాన్వీకి ట్రైనింగ్ ఇస్తున్నాడని తన డెబ్యూ మూవీ "ధడక్" కంటే ముందే సమాచార ముంది. జాన్వీని పెద్ద స్టార్ ని చేసేందుకు శ్రీదేవి - బోనీ జోడీ ఏన్నో ప్రణాళికలు సిద్ధం చేసి జాన్వీని రంగుల ప్రపంచంలోకి పంపేందుకు ఎంతో ముందస్తు ప్రిపరేషన్ సాగించారు. అయితే అనూహ్యంగా గత ఏడాది శ్రీదేవి ఆకస్మిక మరణం జాన్వీని కుంగదీసిన సంగతి తెలిసిందే.