యంగ్ హీరో నాగ శౌర్యకు మోకాలికి బలమైన గాయం తగిలినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు డాక్టర్లు నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని నాగశౌర్య కు చెప్పినట్లు టాక్. ప్రస్తుతం తన సొంత బ్యానర్ మీదనిర్మిస్తున్న  ‘అశ్వద్దామ’ మూవీ షూటింగ్  విశాఖలో చుట్టుపక్కల ప్రాంతాలలో జరుగుతోంది. 

ఈమూవీకి కేజిఎఫ్ లాంటి సినిమాకు పని చేసిన ఫైట్ మాస్టర్ అన్ భైరవ్ ఆధ్వర్యంలో ఫైట్ సీన్లు తీస్తున్నారు. డూప్ లు లేకుండా రోప్ లు లేకుండా బిల్డింగ్ ల మీద నుంచి జంప్ ల లాంటి షాట్ లు తీస్తుండగా నాగ శౌర్య మోకాలికి గట్టిగాయం తగిలింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు 15 అడుగుల పై నుంచి దూకినప్పుడు నాగ శౌర్య మోకాలి దగ్గర డిస్ లోకేషన్ ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనితో వైజాగ్ లోని డాక్టర్లు అతడిని పరీక్షించి కనీసం నాలుగు వారాల రెస్ట్ అవసరం అని చెప్పడంతో నాగ శౌర్య తన షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు సమాచారం. 

గత సంవత్సరం నాగ శౌర్య తన సొంత బ్యానర్ లో నిర్మించిన ‘నర్తనశాల’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఈ యంగ్ హీరోకు తీవ్ర నష్టాలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యంగ్ హీరో పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేని పరిస్థితిలో ఇలా రకరకాల కారణాలతో దురదృష్టం వెంటాడుతోంది అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: