ప్రభాస్ అనుష్కలు కలిసి నాలుగు సినిమాలు చేశారు.  ఈ నాలుగు సినిమాల్లో మూడు హిట్ కొట్టాయి.  అందులో బాహుబలి సీరీస్ తో ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు కూడా.  ఈ కాంబినేషన్లో మరో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.  అయితే, ఒకటే కాంబినేషన్ వరసగా వస్తే బాగోదు కాబట్టి కొద్దికాలం పాటు ఈ కాంబినేషన్లో సినిమా ఉండదు.  


అయితే, ప్రభాస్ సాహో టీజర్ నిన్న రిలీజ్ అయ్యింది. దాదాపు 70 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.  ఈ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకున్న ఏకైక సినిమా ఇదే కావడం విశేషం. సెలెబ్రిటీలంతా ఈ టీజర్ ను విపరీతంగా పొగుడుతున్నారు.  రాజమౌళి నుంచి టాలీవుడ్ లో ప్రతి ఒక్కరు ప్రశంసించారు.  


అయితే, అందరి చూపులు మాత్రం అనుష్కవైపే ఉన్నాయి.  ఈ టీజర్ పై అనుష్క ఎలా స్పందిస్తుంది...  సాహో కు సలహాలు సూచనలు ఏంటి అనే విషయాలను వెల్లడిస్తుందని అనుకున్నారు.  అనుష్క అమెరికాలో షూటింగ్ బిజీలో ఉండటం వలన దీనిపై స్పందించలేదు.  


కాగా ఈరోజు అనుష్క స్పందించింది.  టీజర్ మొత్తం సూపర్ గా ఉందని.. నాకు బాగా నచ్చిందని ఇంస్టాగ్రామ్ లో పేర్కొంది.  సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టుతెలిపింది .  ఎంతైనా సాహో గురించి అనుష్క చెప్తే అదో స్పెషల్ అంతే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: