శేఖర్ కమ్ముల ఎవరితో సినిమా తీసినా ఒక నెల..రెండు నెలలు ప్రతీ ఒక్కరితో రిహార్సల్స్ చేయించి గానీ సెట్స్ మీదకు వెళ్ళడు. ఒక వేళ లొకేషన్స్ లో కూడా సీన్ అనుకున్నట్టు రాకపోతే కూల్ గా ఆ రోజంతా రిహార్సల్ చెసుకోమని చెప్పడం శేఖర్ కి అలవాటు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి కూడా తను తీసే భారీ సినిమాలకు స్టార్ హీరోసందరితోను నెలల తరబడి ప్రాక్టీస్ చేపిస్తుంటారు. దీని వల్ల లాభ నష్టాల మాట పక్కన పెడితే ఆర్టిస్టులు పర్ఫెక్ట్‌గా పర్ఫార్మ్ చేసే స్కోప్ బాగా ఉంటుంది. ఇప్పుడిదే ఫార్ములాను త్రివిక్రమ్ కూడా ఫాలో అవుతున్నారు. తను బన్నీతో తీస్తున్న సినిమాకు ఇలానే బన్నీ తో సహా అందరితోను రిహార్సల్స్ చేపిస్తున్నారట.


ఇదేం కొత్త పద్దతి కాకపోయినప్పటికి షాట్స్ త్వరగా కంప్లీటవుతాయట. మూడు నాలుగు రోజుల షాట్స్ అన్నీ ఒకేసారి రెడీ చేసుకుని, వన్ డే వర్క్ షాప్ ఏర్పాటు చేసి, ఫుల్ గా రిహార్సల్ చేయిస్తున్నారట. రిహార్సల్ అయిన నెక్స్ట్ డే నుంచి మూడు, నాలుగు రోజులు కంటిన్యూస్‌గా షూట్ చేసేస్తారు.


మళ్లీ మరో రోజు ఓన్లీ రిహార్సల్ చేసి, మూడు నాలుగు రోజులు షూట్ కు వెళ్తారన్నమాట. త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న బన్నీ సినిమాకు ఇదే పద్దతి పాటిస్తున్నారు. బన్నీ కూడా రిహార్సల్ కు హాజరవుతున్నారు. ఇక మిగిలిన కాంబినేషన్ ఆర్టిస్టుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వాళ్ళంతా ముందే రెడీ. అయితే దీనివల్ల కాల్ షీట్ లు పెరుతాయోమో? లేదా టేక్ లు తక్కువై, వర్క్ స్పీడ్ అవుతుందో? లేదో తెలీదు. ఒకవేళ దీనివల్ల కాస్ట్ ఆఫ్ బడ్జెట్ తగ్గితే మాత్రం అందరు ఇదే పద్దతి ఫాలో అవడం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: