కీర్తి సురేష్ ఇప్పుడు హాట్ హీరోయిన్.  వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది.  టాలీవుడ్ లో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది.  అందులో ఒకటి నాగార్జున మన్మధుడు 2 కాగా, రెండో సినిమా నాగేంద్ర దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మిస్తున్న సినిమా.  ఈ సినిమాలో కీర్తి సురేష్ మెయిన్ లీడ్ రోల్ చేస్తోంది.  


అటు బాలీవుడ్ లో కూడా మంచి సినిమా చేస్తున్నది.  ఇదిలా ఉంటె, కీర్తి సురేష్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తున్నాడట.  గెస్ట్ రోల్ చేసేందుకు ఎన్టీఆర్ అంగీకరించారట.  సో, ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ముందే ఎన్టీఆర్ కీర్తి సురేష్ సినిమాలో చూడొచ్చన్నమాట. 


ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  యితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.


ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ జులై 30 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.  రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: