ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ‘ఫాదర్స్ డే’ జరుపుకుంటున్న సందర్భంలో నాని ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు అర్జున్ (జున్నూ) గురించి అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసాడు. ఎప్పుడైనా షూటింగ్ లేనప్పుడు తనకు తన భార్యతో కలిసి రెస్టారెంట్ కు కానీ షాపింగ్ కు కానీ వెళ్ళాలి అనిపించినప్పుడు తన కొడుకు అర్జున్ తమతో వస్తానని గోల చేసినప్పుడు తెలివిగా తాను తన కొడుకును ఏవిధంగా మోసం చేస్తున్నాడో వివరించాడు.

తన కొడుకు జున్నూకు తాను నటించే సినిమాలలోని పాటలు చాల ఇష్టమని ఆ పాటలు తన ఇంటిలోని టీవిలో ప్లే చేసి పెట్టినప్పుడు అల్లరి చేయకుండా చెప్పినట్లు వింటాడన్న విషయాన్ని వివరిస్తూ మరొక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసాడు. తాను తన భార్య అంజూతో కలిసి బయటకు వెళ్ళుతున్నప్పుడు తాను కూడ తమతో వస్తానని అల్లరి చేసినప్పుడు తన కొడుకును డైవర్ట్ చేయడానికి తాను నటించిన సినిమాలు పెట్టినప్పుడు అవి చూస్తూ తాము బయటకు వెళ్ళిపోయిన సందర్భాన్ని పట్టించుకోడు అంటూ తన కొడుకు తన సినిమాల వీరాభిమాని అంటూ జోక్ చేసాడు.

ఇదే సందర్భంలో మరొక విషయం షేర్ చేస్తూ తనకు షూటింగ్ లేనప్పుడు వీలైనంత ఎక్కువ సమయం తన కొడుకుతో గడపడానికి ప్రయత్నిస్తానని చెపుతూ తన కొడుకుకు అన్నం పెట్టడంలో నిద్రపోతున్నప్పుడు జో కొట్టడంలో తాను పొందుతున్న ఆనందాన్ని వివరించాడు. అంతేకాదు తాను షూటింగ్ ల కోసం బయటకు వెళ్ళినప్పుడు తనకు నచ్చిన అనేక బట్టలు బూట్లు తన కొడుకు కోసం కొన్నా అవేవి అతడి సైజుకు సరిపోయేవి అవ్వకపోవడంతో అనవసరంగా వస్తువులు కొంటున్నారు అంటూ తన భార్య తన తల్లి తనను తెగ తిడతారు అన్న విషయం నవ్వుతు తెలియ చేసాడు నాని.

ఇదే ఇంటర్వ్యూలో మరొక ట్విస్ట్ ఇస్థూ నాని తాను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి మరెన్నో క్లిష్టమైన పాత్రలు పోషించినా తనకు తన  సెల్  ఫోన్ ద్వారా ఆన్ లైన్ బ్యాంకింగ్ చేయడం రాదనీ దీనితో తాను ఏవస్తువులు కొన్నా ఏ హోటల్ కు వెళ్ళినా తన భార్య అంజూ మాత్రమే ఆన్ లైన్ బ్యాంకింగ్ చేస్తూ పేమెంట్స్ చేస్తుందని చెపుతూ తనకు ఇప్పటి వరకు కనీసం వంద సార్లు తన భార్య ఆన్ లైన్  బ్యాంకింగ్ నేర్చిపించినా తనకు ఒక్క విషయం కూడ అర్ధం కాలేదు అంటూ జోక్ చేసాడు. ప్రతి తండ్రి తన కొడుకు దృష్టిలో హీరోగా ఉండాలని కోరుకుంటాడనీ అదేవిధంగా తాను కూడ తన కొడుకు విషయంలో భావిస్తున్నా తన కొడుకు పెద్ద అయ్యాక తన గురించి తన కొడుకు ‘హీరో అనుకుంటాడో జీరో అనుకుంటాడో’ తనకు తెలియదు అంటూ తనపై తానే నాని సెటైర్ వేసుకున్నాడు..  



మరింత సమాచారం తెలుసుకోండి: