ఈరోజు ఫాదర్స్ డే కావడంతో అనేకమంది సెలెబ్రెటీలు తమ తండ్రితో తమ అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటూ తమ చిన్ననాటి విషయాలను తమ తండ్రితో తమకు ఉన్న బాంధవ్యాన్ని చాల ఉద్వేగపూరితంగా గుర్తుకు చేసుకుంటూ అనేక పత్రిలకు ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇలాంటి నేపధ్యంలో మెగా బ్రదర్ నాగబాబు తమ తండ్రితో తనకు ఉన్న బంధాన్ని వివరిస్తూ తన తండ్రి తరువాత తమ కుటుంబానికి ఒక తండ్రిలా అన్ని విషయాలలో అండగా నిలుస్తున్న చిరంజీవి గురించి వివరిస్తూ ఒక సందర్భంలో తనను చిరంజీవి గట్టిగా చాచి లెంపకాయ కొట్టిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.

చిరంజీవి ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో నాగబాబు 7వ తరగతి చదువుతున్నాడట. చిరంజీవి ఒక రోజు నాగబాబుకు లాండ్రీకి వెళ్లి బట్టలు తీసుకురమ్మని చెప్పి మరేదో పనిమీద బయటకు వెళ్లాడట. పని ముగించుకుని వచ్చిన చిరంజీవికి నాగబాబు లాండ్రీకి వెళ్లలేదని తెలిసి బాగా కోపం వచ్చిందట. చెప్పిన పని చేయవా అంటూ చేయి చేసుకున్నాడట.

అయితే అప్పుడు జరిగిన ఆ సంఘటన తనకు కోపం రావడంతో తాను తన తండ్రితో చెప్పినా తన తండ్రి మాత్రం తన అన్న చిరంజీవికి అప్పట్లో బాసటగా నిలిచి తనను తప్పు పట్టిన విషయాన్ని నాగబాబు గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు చిరంజీవి తన తరువాత ఇంటి పెద్ద అనీ అందువల్ల చిరంజీవి చెప్పిన విషయాలు ఏమైనా చేసి తీరవలసిందే అంటూ అప్పట్లో తమ తండ్రి వెంకట్ రావ్ తమకు చెప్పిన విషయాలను నాగబాబు గుర్తుకు చేసుకున్నాడు. 

ఆ సంఘటన జరిగిననాటి నుండి చిరంజీవి ఎంతో మారిపోయాడనీ ఆరోజు నుండి తనను కానీ పవన్ కళ్యాణ్ ను కానీ ఒక్క మాట కూడ అనకుండా ఎంతో ప్రేమగా తమ ఇద్దరినీ కన్న తండ్రిలా చూసుకున్న విషయాలను నాగబాబు గుర్తుకు చేసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలి అంటే చిరంజీవి తన తమ్ముళ్ళను అదేవిధంగా తన చెల్లెళ్ళను చాల అభిమానంగా తండ్రి స్థానంలో ప్రేమగా చూసుకున్న నేపధ్యంలో మెగా ఫ్యామిలీకి ఎప్పుడు చిరంజీవి కుటుంబ పెద్దగా మాత్రమే కాకుండా తండ్రి స్థానంలో కొనసాగుతున్నాడు..  



మరింత సమాచారం తెలుసుకోండి: