టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తీసిన బాహుబలి రెండు సినిమాలు ఒకదానిని మించి మరొక్కటి సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచి తెలుగు సినిమా ఖ్యాతిని దేశ, విదేశాలకు తెలియచేసేలా చేసింది. అయితే అంత పెద్ద విజయం తరువాత రాజమౌళి ఎటువంటి సినిమాని చేస్తారా అని కోట్లాది మంది ప్రేక్షకులు చూసిన ఎదురుచూపులకు అయన తెరదించుతూ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రాంచరణ్ లను హీరోలుగా పెట్టి మరొక్కసారి భారీ బడ్జెట్ సినిమాను తీయడానికి సన్నద్ధమయ్యారు. స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిష్ వారితో పోరాడి జనం గుండెల్లో గొప్ప వీరులుగా పేరుగాంచిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల జీవిత గాథల ఆధారంగా కొత్త కల్పిత కథను జోడించి తమ సినిమా ఆర్ఆర్ఆర్ ని తీస్తున్నట్లు ఇటీవల రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇకపోతే, అనుకున్నట్లుగానే దాదాపుగా రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదలైనప్పటినుండి అందరిలోను ఒకటే చర్చ నడుస్తోంది, అదేమిటంటే, ఈ ఆర్ఆర్ఆర్ సినిమా బాహుబలిని ఎంతవరకు అందుకుంటుంది, వాటి రికార్డులను బద్దలు కొడుతుందా లేదా అని. అయితే ప్రస్తుతం కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు ఊహకందని రేటుకు అమ్మడుడుపోయాయని సమాచారం. అంతేకాదు నైజాం హక్కుల కోసం టాలీవుడ్ బడా నిర్మాత ఒకరు ఎన్ని కోట్లయినా ఇవ్వడానికి సిద్ధమయ్యారని, అలానే సీడెడ్, ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరాంధ్ర ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా అన్ని చోట్ల నుండి ఊహకందని విధంగా బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. అయితే అసలు ఈ సినిమా పక్కాగా బాహుబలి సినిమాల రికార్డులను బద్దలుకొడుతుందా లేదా అనేది పక్కాగా ఇప్పుడే చెప్పలేకపోయినప్పటికీ, 

ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న క్రేజ్ మరియు బిజినెస్ రేంజిని చూస్తుంటే చాలావరకు కొట్టే అవకాశమే కనపడుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయినా ప్రతి సినిమాని తన మొదటి సినిమాగా భావించి, ప్రతి ఒక్క సీన్ ని ఎంతో శ్రద్ధగా తీసే రాజమౌళి, ఒక సినిమాని మొదలెట్టారంటే దాని విజయం కోసం నిరంతర శ్రామికుడిగా పనిచేస్తారని అయన సినిమాల వరుస విజయాలను బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది. ఆ విధంగా ఈ ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా అయన సూపర్ డూపర్ హిట్ రేంజికి తీసుకువెళ్లే అవకాశం ఉందనే అంటున్నారు ప్రేక్షకులు కూడా. అయితే చూడలి మరి రాబోయే రోజుల్లో ఈ ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి విజయాన్ని అందుకుని బాహుబలి రికార్డులను ఏ మాత్రం బద్దలుకొడుతుందో...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: