కాజల్ తేజాల కాంబినేషన్ లో వచ్చిన ‘సీత’ ఫ్లాప్ అయినా ఆమూవీ రిజల్ట్ కాజల్ పై ఎటువంటి ప్రభావం చూపించలేదు అన్న విషయం ఒకటి ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల హవా నడుస్తున్న నేపధ్యంలో ఈమూవీల ట్రెండ్ పై కాజల్ కు కూడ దృష్టి పడినట్లు సమాచారం.

‘లక్ష్మీ కళ్యాణం’ మూవీతో కాజల్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజాకు కృతజ్ఞతగా మరొక అవకాసం కాజల్ ఇచ్చినట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్య తేజ కాజల్ ను కలిసి చెప్పిన ఒక పవర్ ఫుల్ హీరోయిన్ ఓరియంటెడ్ స్టోరీ ఆమెకు నచ్చడమే కాకుండా ఆసినిమాను ఆమె స్వయంగా నిర్మించడానికి నిర్మాతగా మారుతున్నట్లు సమాచారం.

50 సినిమాలలో నటించి టాప్ హీరోలు అందరితోను రొమాన్స్ చేసిన కాజల్ ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ నుండి తనకు ఎదురౌతున్న పోటీని తట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. దీనితో ఆమె వ్యాపార రంగంలోకి దిగడమే కాకుండా సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించి చిన్న హీరోలతో సినిమాలు చేసే భారీ ప్లాన్ లో ఉన్నట్లు టాక్. 

అయితే నిర్మాతగా మారి సినిమాలు చేసిన జయసుధ జీవితలు దగ్గర నుండి ఛార్మీ వరకు చాలామంది పాపులర్ హీరోయిన్స్ సినిమా నిర్మాణ రంగంలో బాగా దెబ్బ తిన్నారు. అయితే ఈ అనుభవాలను పట్టించుకోకుండా కాజల్ ధైర్యంగా తేజాను నమ్ముకుని చేయబోతున్న ఈ ప్రయోగం ఆమె కెరియర్ కు ఎలాంటి మలుపు ఇస్తుంది అంటూ చాలామంది ఇండస్ట్రీ ప్రముఖుల కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: