జిబ్రాన్..ఈ పేరు మన టాలీవుడ్‌లో అంతగా విన్న పేరు కాదనడానికి పెద్ద కారణాలు అవసరం లేదనే చెప్పాలి. రెండు వందల కోట్ల బడ్జెట్ తో ఎన్నో అంచనాలను మోస్తూ ఆగస్ట్ 15 రాబోతున్న సాహో గురించి ఎంత చెప్పుకున్నా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆరాటం తీరడంలేదు. రికార్డుల ఊచకోత టీజర్ తోనే మొదలైపోయిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం జిబ్రాన్ ను అఫీషియల్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇంత భారీ కాన్వాస్ ఉన్న మూవీకి జిబ్రాన్ ఎంత వరకు న్యాయం చేయగలడు..? అనే దాని మీద కొంత సందేహం రావడం సహజం.


ఎందుకంటే మనోడికి రన్ రాజా రన్ తప్ప తెలుగులో పెద్దగా సక్సెస్ లేదు. అదీ కూడా సుజిత్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమానే. మరి ఇంత పెద్ద బరువును జిబ్రాన్ ఎలా మోస్తాడు అనే కోణంలో ఇప్పటికే విశ్లేషణలు మొదలైపోయాయి. అయితే వాటికి సమాధానంగా వచ్చే నెల విడుదల కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాక్షసుడుని శాంపిల్ గా చూపించబోతున్నారట. ఎందుకంటేఈ సినిమాకి దానికి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పడానికి కూడా ఓ కారణం ఉంది. రాక్షసుడు ఒరిజినల్ వెర్షన్ 'రట్ససన్' సక్సెస్ కావడంలో జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలక పాత్ర పోషించింది. 


దాదాపు గంట పాటు ఉండే బీజీఎమ్ ని యూట్యూబ్ లో పెడితే 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి అంటే అర్థం చేసుకోవచ్చు జనానికి జిబ్రాన్ కంపోజింగ్ ఏ రేంజ్ లో రీచ్ అయ్యిందో. ఇప్పుడు రాక్షసుడుకి అదే మేజిక్ రిపీట్ చేయడంలో ఎలాంటి సందేహం లేదు. సో సాహోకు జిబ్రాన్ ఎంతవరకు న్యాయం చేస్తాడు అనే దాని గురించి టెన్షన్ పడుతున్న వాళ్లకు రాక్షసుడు ఓ మంచి ఎగ్జాంపుల్  గా ఉండే అవకాశం ఉంది. ఎలాగూ సాహూ టీజర్ లో మెప్పించాడు కాబట్టి ఫైనల్ అవుట్ పుట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వర్గం తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: