సోషల్ మీడియాలో హీరోయిన్స్ తమ హాట్ ఫొటోస్ ను షేర్ చేసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. సోషల్ మీడియా గురించి తెలిసినవారికి 'చిరుత' ఫేమ్ నేహ శర్మ పేరు తెలిసే ఉంటుంది.   సినిమాల్లో నేహ గొప్పగా సాధించిందేమీ లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ పాపులారిటీ సాధించింది.  ఈ భామకు ఒక హాటు చెల్లి ఉంది.. పేరు ఐష శర్మ.  నేహ అప్పుడప్పుడూ చెల్లితో కలిసి కసరత్తులు చేస్తూ.. ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. 


గ్లామర్ విషయంలో అక్క నేహకు ఈ చెల్లి ఏమాత్రం తీసిపోదు.  ఈ భామ ఒకటి అరా బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది.  జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన 'సత్యమేవ జయతే' లో హీరోయిన్ గా నటించింది. ఐష కు 1.1 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ భామ అమెరికా ట్రిప్ లో ఉంది. అక్కడి నుంచి ఒక హాట్ ఫోటోల బంచ్ ను తన ఇన్స్టా ఖాతా ద్వారా అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలకు "ఓ సోమవారం.. నీకోసం నేను రెడీగా లేను. వీకెండ్ అంతలోపే అయిపోయిందా? #ఐషా ట్రావెల్స్ #సియాటిల్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.


  వీకెండ్ అయిపోయింది.. సోమవారం కూడా అయిపోయింది..  ఈరోజు మంగళవారం.  అయినా సోమవారం అంటుందేంటో.  ఈ ఫోటోలలో ఐషా  శర్మ ఒక బ్లాక్ గౌన్ వేసుకుంది.  స్లీవ్ లెస్ గౌన్.. వీ నెక్ ఉండడంతో అందాల వడ్డన ఆటోమేటిక్ గా జరిగిపోయింది.ఈ ఫోటోకు నెటిజనులు కత్తిలాంటి కామెంట్లు పెట్టారు. "నువ్వు రెడీగా లేవు కానీ నీ ఫోటోలకు మేము రెడీ".. "పర్ఫెక్ట్ హాటీ".. "ఝాకాస్ పోజ్".. "అక్కను మించిన చెల్లి" లాంటి కామెంట్లు వచ్చాయి.  ఇదిలా ఉంటే ఈ ఐష చేతిలో ప్రస్తుతం సినిమాలేవీ లేవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: