సాధారణంగా టాప్ హీరోల షూటింగ్ స్పాట్ కు వారి అభిమానులు వచ్చి ఆ హీరోలతో సెల్ఫీలు తీయించుకోవడం క్రేజీ టాపిక్. అయితే దీనికి భిన్నంగా ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందింప బడుతున్న మూవీ షూటింగ్ స్పాట్ కు అల్లు అర్జున్ అభిమానులు అనేకమంది వస్తూ బన్నీని కలవడం కంటే అతడి విలాసవంతమైన కార్వాన్ ను చూడటానికి ఆ కార్వాన్ ను పక్కన నుంచుని ఫోటోలు తీయించు కోవడానికి ఒక మ్యానియాలా ఎగపడటం ఆత్యంత ఆశ్చర్యకరంగా మారింది.

ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక కీలక షెడ్యూల్ లో కొన్ని ముఖ్య సన్నివేశాలు అల్లు అర్జున్ పూజ హెగ్డే టబూ లపై త్రివిక్రమ్ చిత్రీకరిస్తున్నాడు. ఈ షూటింగ్ స్పాట్ బయట బన్నీ కార్వాన్ పార్క్ చేయబడి ఉండటంతో పాటు ఆ కార్వాన్ పై ‘AA’ అన్న అక్షరాలు పెద్దపెద్దవిగా కనిపించడంతో బన్నీ కార్వాన్ ను గుర్తించి ఆ కార్వాన్ ను అనుకుని ఫోటోలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు చాలామంది ఉపయోగిస్తున్న కార్వాన్స్ లో అల్లు అర్జున్ కార్వాన్ అత్యంత విలాసవంతమైంది. అత్యాధునిక సౌకర్యాలతో పాటు అత్యంత ఖరీదైన ఇంటీరియర్ తో బన్నీ మనసుపడి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ఈ కార్వాన్ ఖరీదు నాలుగు కోట్లు. 

బన్నీ లాగే అతడి కార్వాన్ కూడ సెక్సీగా ఉంటుంది అని కామెంట్స్ కూడ వచ్చాయి. దీనితో ప్రస్తుతం ఈ కార్వాన్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆశ్చర్యంగా సినిమా సెలెబ్రెటీలు అంతా ప్రైవసీ కోరుకుంటారు. అయితే బన్నీ మాత్రం తాను ఉపయోగించే కార్వాన్ అందరికీ తెలిసే విధంగా దానిపై పెద్దపెద్ద అక్షరాలతో ‘AA’ అని డిజైన్ చేయించి ఇలా ఎందుకు తనతో సమానంగా తన కార్వాన్ ను కూడ ప్రమోట్ చేస్తున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: