ఎలాంటి వివాదంలోకి రాకుండా పద్దతిగా పక్కకు వెళ్ళిపోయే అమలాపాల్ ఇప్పుడు హాట్ టాపీగా మారింది. గతంలో సూచిలీక్స్ లో అమ్మడి ఫోటోలు రావడంతో తన వైవిహిక బంధానికి విడాకులు ఇచ్చింది. దీంతో ఆగకుండా ఇప్పుడు హాట్ ఫోటోలను అభిమానులకు కానుకగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా అమల నటించి ఆమె టీజర్ మంగళవారం విడుదలైంది. ఈ టీజర్ లో అమల ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా నటించడంతో ‘ఆమె’ టీజర్‌తో సన్సేషన్‌గా మారింది.

అయితే ఆమె నగ్నత్వంలో నిజాయితి నా హృదయానికి హత్తుకుందంటూ తాజాగా  వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ టీజర్‌ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. న్యూడ్‌గా నటించిన అమాలాపాల్‌పైన.. దర్శకుడు ఎమ్.ఆర్ రత్న పైన ప్రశంసల జల్లు కురిపించారు.
ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. అమలాపాల్ లీడ్‌లో నటిస్తున్న తమిళ చిత్రం ‘ఆడై’ను తెలుగులో ఆమె పేరుతో విడుదల చేస్తున్నారు. తమిళ్‌లో ఆడై అంటే ‘డ్రస్’ అని అర్ధం. తమిళ టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ టీజర్‌లో అమలాపాల్ డ్రెస్ లేకుండా ఉంది.

తన కూతురు కనిపించడం లేదని ఒక తల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ చేయడం.. పోలీసులు ఎంక్వైరీలో చివరిగా ఆమె ఫోన్ మాట్లాడినప్పుడు తాగి ఉందని తెలుసుకోవడం.. పోలీసులు మిస్ అయిన అమ్మాయిని వెదకడం, చివరిగా ఒక ఆమె పనిచేస్తున్న ఆఫీస్‌లో నగ్నంగా రక్తపు మడుగులో ప్రాణాలతో పడి ఉండటంతో టీజర్ ఎండ్ చేశారు. అయితే ఆమెపై అలా ఉండటానికి కారణం ఏంటి? ఆమెపై అత్యాచారం జరిగిందా? ఎవరు చేశారు? ఎందుకు తాగి పడిఉంది? లాంటి ఆసక్తికర థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో బోల్డ్ అండ్ థ్రిల్లర్‌గా ఉంది ‘ఆమె’ టీజర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: