హృదయ కాలేయం’ అనే చిత్రంతో సంచలన స్టార్ అయిన సంపూర్ణేష్ బాబు మళ్లీ చాలా గ్యాప్ తర్వాత తెర మీదకు రాబోతున్నాడు. కేవలం ఒకే ఒక చిత్రం తో అగ్ర నటుడికి ఎంతటి క్రేజ్ ఉంటుందో అలాంటి క్రేజ్ తెచ్చుకున్న సంపూ..తాజాగా కొబ్బరిమట్ట అనే చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఏడాది పైగానే అవుతుంది. కానీ విడుదల మాత్రం నోచుకోలేదు. దీనికి కారణాలు ఏంటో కరెక్ట్ గా తెలియదు కానీ ప్రస్తుతం ఈ మూవీ విడుదల కు సిద్ధం అయినట్లు చిత్ర యూనిట్ తెలిపారు.


ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఈ నెల 20 న ఉదయం 9 గంటలకు ప్రకటించనున్నట్లు తెలిపారు.ఈ సినిమా ముగ్గురు భార్యలున్న ఒక మనసున్న భర్త కథని చెప్పాడు. ఈ చిత్రంలో సంపూ అండ్రాయిడ్ పాత్ర‌తో పాటు ఇంకో రెండు పాత్రలు కూడా చేస్తున్నాడు. ఒకటి పాపారాయుడు.. ఇంకోటి పెదరాయుడు. సంపూ తొలి సినిమాను రూపొందించిన స్టీఫెన్ శంకర్ ఈ చిత్రానికి కథ.. మాటలు అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. రొనాల్డ్ రూపక్ సన్ ద‌ర్శ‌కుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: