హాట్ హీరోయిన్ అమలాపాల్ ఇటీవల ‘అడై’ సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసినదే. డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో అమలాపాల్ ఈ సినిమా చేసింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న క్రమంలో ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో అమలాపాల్ అద్భుతంగా నటించిందని ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్.


ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచే చేశారు. ఇప్పటివరకు  పోస్టర్ల తోనే సర్ప్రైజ్ లు ఇచ్చిన అమలాపాల్ టీజర్ లో పెద్ద షాకే ఇచ్చింది. తాజాగా  విడుదలైన టీజర్లో ఒక సన్నివేశంలో అమలాపాల్ పూర్తి నగ్నంగా కనిపించింది. పాత్ర డిమాండ్ చేస్తే అమల ఎలాంటి సన్నివేశాలు చేయడానికి సిద్ధమని అమలాపాల్ మరొకసారి ఈ చిత్ర టీజర్ ద్వారా నిరూపించింది.


కేవలం ప్రేక్షకుల నుంచి మాత్రమే కాక సినీ ప్రముఖుల నుంచి కూడా టీజర్ కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ పై సమంత రియాక్ట్ అయింది. “‘అడై’ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. బెస్ట్ విషెస్ టు అమలాపాల్. సినిమా కోసం నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాను” అంటూ సమంత ట్వీట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: