పెళ్ళి చూపులు సినిమాతో ఫేమస్ అయిన హీరో " విజయ్ దేవరకొండ".  తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా యూత్ ని తెగ ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఒక సంచలనం సృష్టించింది. దీంతో విజయ్ దేవరకొండ కి అభిమానులు పెరిగిపోయారు. అర్జున్ రెడ్డి సినిమా ఒక కల్ట్ సినిమాగా మిగిలిపోయింది.

 

ఆ తరువాత విజయ్ దేవరకొండకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. సహజమైన నటనతో విభిన్నమిన కథల్ని ఎంచుకుంటున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన "గీత గోవిందం" సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఇప్పుడు విజయ్ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ భరత్ కమ్మ దర్శకత్వంలో రష్మిక హీరోయిన్‌గా తెరకెక్కిన ‘డియర్ కామ్రేడ్’ మూవీ వచ్చే జులై 26న విడుదల కానుంది.

 

ఈ సినిమా కి సంబంధించిన లిరికల్ సాంగ్స్ ని విడుదల చేసారు. యూట్యూబ్ లో వాటికి మంచి  రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఆ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే విజయ్ మాత్రం వరుసగా సినిమాల్ని ఒప్పుకుంటున్నాడట. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో క్రీడా ప్రధానంగా సాగే మరో మూవీలో విజయ్ నటిస్తున్నారు. ‘హీరో’ అనే క్రేజీ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీలో విజయ్ ప్రొఫెషనల్ బైక్ రైడర్‌గా కనిపిస్తారని వినికిడి.

 

వీటితో  పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో  ఓ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో విజయ్ పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ యంగ్ స్టార్ ఈ చిత్రంలో రచయితగా కనిపిస్తారట. అలాగే రచయితగా ఆయన రాసిన కథల పాత్రలలో మళ్ళీ ఆయన కనిపిస్తారట. వైవిధ్యంగా అనిపిస్తున్న ఈ కథనంతో విజయ్ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరో విశేషం ఏమిటంటే ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: