సిసింద్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు  అఖిల్. ఆ తర్వాత అక్కినేని కుటుంబం నటించిన " మనం" సినిమాలో తళుక్క్నమన్నాడు.    హీరో గా నటించిన తొలి చిత్రం "అఖిల్" ఈ సినిమాకి వి వి  వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డాడు. ఫైట్స్, డాన్సులు ఈ సినిమాలో బాగా చేసాడు. కానీ ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు.  అలా తన మొదటి సినిమా ఒక ఫ్లాప్ సినిమాగా మారింది.

 

వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న అఖిల్..ప్రస్తుతం తన నాల్గో చిత్రం చేయబోతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కాస్టింగ్ తో పాటు షెడ్యూల్స్ ప్లాన్ కూడా పూర్తి అయ్యాయి. కానీ రెండు విషయాలు మాత్రం నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాయట. అవి టైటిల్, హీరోయిన్.అఖిల్ సరసన హీరోయిన్ ను ఫిక్స్ చేయడం అంటే అంత వీజీ కాదు.

 

అఖిల్ అన్ని సినిమాల విషయంలో కూడా హీరోయిన్ ఫిక్స్ చేయడం కాస్త ఆలస్యమే అయింది. ఈ సినిమా విషయంలోనూ అలాగే జరుగుతుంది. కొత్త అమ్మాయిలను చూస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ కోసమే ఆడిషన్లు చేస్తున్నారు. అదే టైమ్ లో ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్త లైమ్ లైట్ లో వున్నవారినీ సైతం పరిశీలిస్తున్నారు.

 

ఇప్పడిప్పుడే వచ్చిన, వస్తున్న అమ్మాయిల దగ్గర నుంచి కాస్త పాపులర్ యంగ్ హీరోయిన్ల పేర్లు అన్నీ పరిశీలనలో వున్నాయి అని వినిపిస్తోంది. మొదటి షెడ్యూల్ లో హీరోయిన్ అవసరం లేకపోవడం తో ఆ షెడ్యూల్ ను కానిస్తున్నారు. ఆ తర్వాత షెడ్యూల్ మొదలై నాటికీ హీరోయిన్ ను ఫిక్స్ చేయాలనీ దర్శక , నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. మరి అఖిల్ సరసన ఎవరిని ఫిక్స్ చేస్తారో అని అంత ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా విజయం సాధిస్తాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: