మెగాస్టార్ కు ఒకసారి ఎవరైనా నచ్చారు అంటే.. వారి లైఫ్ కు ఇక ఢోకా ఉండదు.  వాళ్లను చాలా బాగా చూసుకుంటారు.  గతంలో దేవీశ్రీని ఎంతగా ప్రోత్సహించాడో చెప్పక్కర్లేదు.  దేవి కూడా మెగాస్టార్ సినిమాలకు మంచి సంగీతం అందించాడు.  ఇప్పుడు సైరా సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ దర్శకుడు సంగీతం అందిస్తున్నాడు.  


బాలీవుడ్ లో అనేక విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించిన అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  అమిత్ పనితనం మెగాస్టార్ కు బాగా నచ్చిందట.  సైరా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికే స్టార్ట్ చేశారు.  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్స్ విన్న మెగాస్టార్ ఇంప్రెస్ అయ్యారు.  


చూస్తుంటే తన నెక్స్ట్ సినిమాకు కూడా అమిత్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకునేలానే ఉన్నాడు.  మెగాస్టార్ కు ఒక్కసారి నచ్చితే చాలు.  సైరా సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది.  పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.  


ఆగష్టు 22 వ తేదీన మెగాస్టార్ పుట్టినరోజు.  ఆరోజున సైరా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేస్తారు.  అలానే ఈ సినిమాలు సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని అందిస్తారని తెలుస్తోంది. అదే రోజున మెగాస్టార్ కొరటాల సినిమా కూడా ప్రారంభం కాబోతున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: