క్రియేటివ్ దర్శకుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన  ప్రశాంత్ వర్మ ఇప్పటివరకు నిర్మించిన సినిమాలు కేవలం రెండు మాత్రమే అయినా ఈ దర్శకుడుకి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. రాజశేఖర్ హీరోగా ఇతడు రూపొందించిన ‘కల్కి’ మూవీ ఇటీవలే విడుదలై డివైడ్ టాక్ తెచ్చు కున్నప్పటికి ఈమూవీ ప్రమోషన్ ను ఇంకా ప్రశాంత్ వర్మ కొనసాగిస్తున్నాడు. ఈ ససందర్భంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ యంగ్ డైరెక్టర్ అనేక ఆసక్తికర విషయాల పై స్పందిస్తూ .తన మొదటి సినిమా ‘అ’  సినిమా విడుదలకు ముందు జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసాడు. 

‘అ’ సినిమావిడుదలకు ముందే తాను చాల కధలు రాసుకున్న విషయాలను గుర్తుకు చేసుకుంటూ అప్పట్లో తనకు చిరంజీవికి ఒక కథ చెప్పే అవకాసం వచ్చింది అన్న విషయాన్ని బయటపెట్టాడు. అయితే తన జీవితంలో వచ్చిన ఆ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాల పట్టుదలగా చిరంజీవి వద్దకు వెళ్ళి ఒక పవర్ ఫుల్ స్టోరీని చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.

గతంలో పాలకొల్లులో చిరంజీవిని చూడటానికి కష్టపడిన తాను ఏకంగా చిరంజీవి డ్రాయింగ్ రూమ్ లో ఆయన ఎదురుగా కూర్చుని కథ చెప్పడం మొదలు పెట్టినప్పుడు తాను పడ్డ టెన్షన్ వివరించాడు. అయితే చిరంజీవి తాను చెప్పిన కథను చాల ఓపికతో విని తనకు ఇప్పటి వరకు కథలు చెప్పిన వారిలో టాప్ 5 ప్లేస్ లో తనకు స్థానం ఉంటుంది అంటూ ప్రసంసలు కురిపించిన సందర్భాన్ని బయట పెట్టాడు. 

అయితే ప్రశాంత్ వర్మకు చిరంజీవి మాటల పై నమ్మకం కుదరక పోవడంతో మళ్ళీ ఒకటికి రెండు సార్లు రెట్టించి తన కథ నచ్చిందా అని అడిగినట్లు గుర్తుకు చేసుకున్నాడు. అయితే చిరంజీవి తనతో సినిమా చేయకుండా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ సినిమాను అంగీకరించాడు అని వచ్చిన వార్తలను చూసి చిరంజీవి తన కథకు ఇచ్చిన ప్రశంసలు నిజమైనవా కాదా అన్న సందేహాలు తనకు ఇప్పటికీ ఉన్నాయి అంటూ తనపై తానే జోక్ చేసుకున్నాడు..    



మరింత సమాచారం తెలుసుకోండి: