సౌత్ స్టార్ హీరోయిన్ సమంత సినిమా సినిమాకు తన ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంది. తెలుగు, తమిళ భాషల్లో సమంత తెలియని వారు ఉండరంటే నమ్మొచ్చు. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జెస్సీ అలియాస్ సమంత పెళ్లి తర్వాత కూడా తన విజయ పరంపరని కొనసాగిస్తుంది.


కష్టాన్ని నమ్ముకుంటే ఫలితం దానంతట అదే వస్తుందంటారు పెద్దలు ఇది సమంతకు బాగా సూట్ అవుతుంది. పెళ్లికి ముందు కేవలం కమర్షియల్ హీరోయిన్ గా మాత్రమే క్రేజ్ తెచ్చుకున్న సమంత పెళ్లి తర్వాత సెలెక్టెడ్ సినిమాలతో సర్ ప్రైజ్ చేస్తుంది. యూటర్న్, మజిలీ ఇప్పుడు ఓ బేబీ కేవలం సమంత మాత్రమే చేసే సినిమాలుగా చెప్పుకోవచ్చు.


సమంతలో మరో మహానటి కచ్చితంగా ఈ మాట నిజమని చెప్పొచ్చు. అయితే సావిత్రి అంత రేంజ్ కాకున్నా సమంత కూడా ఇచ్చిన పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేస్తుంది. సావిత్రి బయోపిక్ గా చేసిన మహానటి సినిమాలో క్లైమాక్స్ సీన్ లో కూడా విండో దగ్గర సమంత చెప్పిన డైలాగ్స్ చేసిన నటన ఎప్పటికి గుర్తుంటుంది.  


ఇక శుక్రవారం రిలీజైన ఓ బేబీ సినిమాలో సమంత తన నట విశ్వరూపం చూపించిందని చెప్పాలి. సీనియర్ నటి లక్ష్మి హావభావాలను, ఆ ఏజ్ వ్యక్తులు మాట్లాడే డైలాగ్స్, వాటికి కావాల్సిన ఎక్స్ ప్రెషన్స్ అబ్బో ఒక్కటేమిటీ సమంత ఫ్యాన్స్ కు ఓ బేబీ ఓ పక్షభక్ష పరవన్నం అని చెప్పొచ్చు. సమంత సక్సెస్ మేనియా ఇలానే సాగించాలని ఆశిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.    



మరింత సమాచారం తెలుసుకోండి: