జీవితంలో ప్రతీ ఒక్కరికీ ప్రేరణ ఉంటుంది. అది ఎవరి నుండైనా రావచ్చు. మనకు బాగా నచ్చిన వారి నుండి వస్తే ఇంకా బాగుంటుంది. సినిమా వాళ్ళ జీవితాలని చాలా మంది  ప్రేరణగా తిసుకుంటారు. వాళ్ళలాగా అవ్వాలని అనుకుంటారు. మరి ఆ సినిమా వాళ్ళకి ఏది ప్రేరణనిస్తుంది. రోజు వారి షూటింగ్స్ తో అలసిపోయే వారికి సేద తీర్చేది ఏంటి. తాజాగా నిత్యామీనన్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది.

 

‘ఆర్టిస్టులను ప్రేక్షకులు చూసే కోణం వేరు, మమ్మల్ని మేము చూసుకునే కోణం వేరు. అందరికీ నేను నటి నిత్యా మీనన్‌ని కావచ్చు. కానీ నాకు కాదు’’ అంటారు నిత్యా మీనన్‌. షూటింగ్‌ లేని రోజు లేదా ఒంటరిగా ఉన్న సమయాల్లో ఈ బ్యూటీ ఏం చేస్తారో తెలుసా? ఆ విషయం గురించి నిత్యామీనన్‌ మాట్లాడుతూ – ‘‘నటిగా నా మీద ప్రేక్షకులకు కొన్ని అంచనాలు, అభిప్రాయాలు ఉండొచ్చు. అవన్నీ బయట నుంచి చూస్తూ ఏర్పరుచుకున్నవి.

 

నా వరకూ నేను నటి నిత్యను కాదు. నార్మల్‌గా నాలాగే ఉండాలనుకుంటాను. నాతో నేను క్వాలిటీ టైమ్‌ స్పెండ్‌ చేస్తుంటాను. షూటింగ్‌ చేస్తున్న సమయంలో చాలా అలసిపోతాం. కోల్పోయిన శక్తినంతా ఖాళీ సమయాల్లో తిరిగి సంపాదించుకుంటాను. సెల్‌ఫోన్‌ బ్యాటరీలు రీచార్జ్‌ చేసుకున్నట్టే ఇది కూడా (నవ్వుతూ). మనతో మనం కనెక్ట్‌ అయితేనే నేచర్‌తో కనెక్ట్‌ అవగలం. నా శక్తినంతా నేచర్‌ నుంచి తెచ్చుకుంటాను. కేవలం శక్తి మాత్రమే కాదు నా ఇన్‌స్పిరేషన్‌ కూడా నేచరే’’ అన్నారు.

 

ఇలా తనకి ప్రేరణ ప్రకృతి నుండి వస్తుందని, ప్రకృతి స్నేహం చేయడం నిజంగా చాలా బాగుంటుందని, అది మనల్ని ఏమీ అడగదు. మన మీద అలగదు. మన నుండి ఏమీ కోరుకోదు. మనకే అన్ని ఇస్తుంది అందుకే ప్రకృతి తో స్నేహం చేయడం, ప్రకృతి నుండి ప్రేరణ పొందడం తనకి ఇష్టమని చెప్పింది. నిత్యా మీనన్ ప్రస్తుతం  జయలలిత బయోపిక్ లో నటిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: