సమంత మెయిన్ లీడ్ లో నటించిన ఓ బేబీ సినిమా నిన్న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బిగ్ మౌత్ టాక్ తో పాటు, క్రిటిక్స్ నుంచి కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సమంత నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సినీ ప్రముఖులు కూడా సమంత నటనను ఆకాశానికెత్తేస్తున్నారు. సినిమాలోని రెండు షేడ్స్ లో జీవించిందంటున్నారు ప్రేక్షకులు.

 

 ఈ సినిమా విజయంపై, సమంత నటికి ఫిదా అయిన నటి చార్మీ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. “ఏ టైమ్ లో పుట్టావమ్మా నువ్వు? నీ హార్డ్ వర్క్ కు, డెడికేషన్ కు, నీ జాతకానికి ఓ నమస్కారం” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తోటి నటి నుంచి ఇటువంటి ప్రశంసలు వచ్చాయంటేనే అర్ధమవుతోంది సమంత నటన సినిమాలో ఏ స్థాయిలో ఉంటుందో. మామూలుగానే సమంత నటిస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో ఓ అంచానాలే ఉంటాయి. అలాంటి స్టార్ డమ్ ను సంపాదించింది సమంత.

 

సాధారణంగా సినిమా వాళ్ల కెరీర్లో హిట్లు ఎన్నున్నాయో చూస్తాం.. కానీ సమంత విషయంలో మాత్రం తన కెరీర్లో ఫ్లాప్ లు ఎన్నున్నాయి అని వెతుక్కోవాలి. అన్ని హిట్స్ ఉన్నాయి.. ఎంతో ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లూ ఉన్నాయి సమంతకు. ఓ బేబీ సినిమా కూడా సమంత కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయే చిత్రంగా ఉందంటూ సర్వత్రా టాక్ వినిపిస్తోంది. చూద్దాం.. మరింకెంతమంది సెలబ్రిటీలు సమంత నటనకు ఫిదా అయిపోయిన వారి లిస్ట్ లో చేరతారో!


మరింత సమాచారం తెలుసుకోండి: