వీ6 ఛానల్ కు ప్రాణప్రదంలాంటి ప్రోగ్రామ్ తీన్నార్.. ఆ ప్రోగ్రామ్ యాంకర్ సావిత్రికి చాలా క్రేజ్ ఉంది. తెలంగాణ యాసకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. వీ6 న్యూస్ ఛానెల్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె సెలబ్రిటీ స్థాయికి ఎదిగింది.


అలాంటి సావిత్రి ఇపుడు వీ6 న్యూస్ ఛానెల్ కు గుడ్ బై చెప్పింది. మరి ఎందుకంత బిగ్ స్టెప్ తీసుకుంది.. దాన్ని తలదన్నే అవకాశం ఏదో వస్తే తప్ప ఆ నిర్ణయం తీసుకోదు కదా.. తీన్మార్ సావిత్రికి బిగ్ బాస్ 3లో ఛాన్స్ వచ్చిందని టాక్. సావిత్రి అసలు పేరు శివజ్యోతి.


అందుకోసమే ఆమె వీ6 ఛానల్ కు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. తీన్మార్ ప్రోగ్రామ్ కు ఇలా యాంకర్లు ఝలక్ ఇవ్వడం ఇది కొత్త కాదు. మొదట్లో రాములమ్మ అనే యాంకర్ ఈ ప్రోగ్రామ్ చేసేది. ఆమె ప్రస్తుతం వేరే ఛానల్లో ఇదే తరహా ప్రోగ్రామ్ చేస్తోంది.


తీన్మార్ మల్లన్నగా పేరొందిన మరో యాంకర్ కూడా రాజకీయాలవైపు అడుగులు వేసి తీన్మార్ కు గుడ్ బై చెప్పారు. అయితే ఎంతమంది వెళ్లిపోయినా.. ప్రతిసారి ఆ ప్రోగ్రామ్ నిలబడింది. అది ప్రోగ్రామ్ లోని కంటెంట్ గొప్పదనంగా చెబుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: